క్రీడోత్సవాలకు రావాల‌ని మంత్రి జగదీష్ రెడ్డికి ఆహ్వానం

విధాత: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో "ఫ్రెండ్స్ స్పోర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ " క్లబ్ ఆధ్వర్యంలో వచ్చే నెల 7,8,9 తేదీల్లో నిర్వహించే జిల్లాస్థాయి క్రీడోత్సవాలను ప్రారంభించడానికి రావాలని కోరుతూ క్లబ్ కమిటీ సభ్యులు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిని కలిసి ఆహ్వానించారు. తమ క్లబ్ స్థాపించి 40ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా స్థాయి క్రీడల మెగాటోర్నీ నిర్వహిస్తున్నట్లుగా వివరించారు. మంత్రి జగదీష్ రెడ్డి స్పందిస్తూ గ్రామీణ యువతను క్రీడల్లో […]

క్రీడోత్సవాలకు రావాల‌ని మంత్రి జగదీష్ రెడ్డికి ఆహ్వానం

విధాత: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో “ఫ్రెండ్స్ స్పోర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ ” క్లబ్ ఆధ్వర్యంలో వచ్చే నెల 7,8,9 తేదీల్లో నిర్వహించే జిల్లాస్థాయి క్రీడోత్సవాలను ప్రారంభించడానికి రావాలని కోరుతూ క్లబ్ కమిటీ సభ్యులు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిని కలిసి ఆహ్వానించారు.

తమ క్లబ్ స్థాపించి 40ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా స్థాయి క్రీడల మెగాటోర్నీ నిర్వహిస్తున్నట్లుగా వివరించారు. మంత్రి జగదీష్ రెడ్డి స్పందిస్తూ గ్రామీణ యువతను క్రీడల్లో ప్రోత్సహించే దిశగా క్రీడోత్సవాల నిర్వహణకు పూనుకున్న క్లబ్ సభ్యులను అభినందిస్తూ తాను ప్రారంభోత్సవానికి హాజరవుతానని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో ఎఫ్ ఎస్ సి ఏ సభ్యులు పబ్బు ఉపేందర్ బోస్, పలుసం రమేష్, మురారి శెట్టి కృష్ణమూర్తి, కుంభం వెంకట్ పాపిరెడ్డి, అయిటిపాముల సత్యనారాయణ, దంతూరి రాములు, కొండూరు బాలరాజు, బత్తిని సత్యనారాయణ, కాసుల మధు, పలుసం భాను ప్రకాష్, బత్తిని భాస్కర్, గంజి చండీ ప్రసాద్, యానాల సత్యనారాయణ రెడ్డి, కాసుల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.