కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ దాడులు

విధాత : తెలంగాణలో పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతల ఇళ్లపై ఐటీ దాడలు కలకలం రేపాయి. రంగారెడ్డి జిల్లా సీనియర్ కాంగ్రెస్ నేత, మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్‌ఆర్ ఇంటిపైన, ఆయన ముఖ్య అనుచరుడు, బడంగ్‌పేట్ మేయర్ పారిజాతం నరసింహారెడ్డి ఇంటిపైన, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తోడల్లుడు , రియల్ వ్యాపారి గిరిధర్ రెడ్డి ఇండ్లు, కార్యాలయాలపైన ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో అధికార బీఆరెస్, బీజేపీల నేతలపై కాకుండా ప్రతిపక్ష కాంగ్రెస్ ముఖ్య నేతలపైనే ఐటీ దాడులు జరుగుతుండటాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది. మహేశ్వరం నియోజవర్గంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓడిపోతుందన్న భయంతోనే బీఆరెస్ పార్టీ కేంద్రం సహకారంతో ఐటీ దాడులు జరిపిస్తుందని పారిజాతం నరసింహారెడ్డి ఆరోపించారు.