కళా ప్రదర్శన మానసిక ప్రశాంతత … మంత్రి జూపల్లి

కళా ప్రదర్శనలను, మంచి పెయింటింగ్స్‌ను చూసినప్పుడు మ‌న‌సు ప్ర‌శాంతంగా ఉంటుంద‌ని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం రేతిబౌలిలోని కింగ్స్‌ కొహినూర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ‘ఇండియా ఆర్ట్‌ ఫెస్టివల్ ను జూపల్లి ప్రారంభించారు.

కళా ప్రదర్శన మానసిక ప్రశాంతత … మంత్రి జూపల్లి

ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ ప్రారంభోత్సవం

విధాత, హైద‌రాబాద్ : కళా ప్రదర్శనలను, మంచి పెయింటింగ్స్‌ను చూసినప్పుడు మ‌న‌సు ప్ర‌శాంతంగా ఉంటుంద‌ని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం రేతిబౌలిలోని కింగ్స్‌ కొహినూర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ‘ఇండియా ఆర్ట్‌ ఫెస్టివల్ ను జూపల్లి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క‌ళ‌లు, క‌ళాకారుల‌ను ప్రోత్స‌హించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తెలిపారు.

మ‌న ప్రోత్సాహం వారికి మ‌రింత ఉత్స‌హాన్ని ఇస్తుంద‌ని, కొత్త‌ క‌ళాఖండాల‌ను మ‌న‌కు అందించేలా వారికి ప్రేర‌ణ‌ను ఇస్తుంద‌ని చెప్పారు. ప్రముఖ కళాకారులు వేసిన చిత్రాలు, కళాకృతులు ఒకేచోట చూడ‌టం అద్భుతంగా ఉంద‌నని, కళా ప్రేమికులకు ఇది మంచి అవకాశమ‌ని, దీన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. అనేక మంది ప్రఖ్యాత కళాకారులు తీర్చిదిద్దిన చిత్రాల‌ను, కళాఖండాలను మంత్రి జూప‌ల్లి తిల‌కించారు. వారి కృషిని, ప్రతిభను కొనియాడారు. తమ సృజనాత్మకతతో అద్భుత కళాఖండాలతో ఆర్ట్ ఫెస్టివ‌ల్ ను సుసంపన్నం చేసిన కళాకారులను, అలాగే ప్రతి ఏటా ముంబై, బెంగళూర్ లో నిర్వహించే ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ ను మొదటిసారి హైదరాబాద్ లో ఏర్పాటు చేసినందుకు ఆర్ట్ ఫెస్టివల్ డైరెక్టర్ రాజేంద్రను మంత్రి జూపల్లి అభినందించారు.