‘మహిళా కుట్టు మిషన్’ పథకం షురూ.. పాలకుర్తిలో ప్రారంభం

3వేల మందికి శిక్షణ రూ.5 కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌ట‌న‌ మహిళల ఆర్థికాభివృద్ధి సాధ‌నే ల‌క్ష్యం రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విధాత, వరంగల్: మహిళా సాధికారత లక్ష్యంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, స్త్రీ నిధి సహకారంతో రాష్ట్రంలో మొదటిసారి పాలకుర్తిలో 3వేల‌ మంది మహిళలకు కుట్టు మిషన్ శిక్షణా కార్యక్రమాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. సోమవారం పాలకుర్తి నియోజకవర్గం […]

‘మహిళా కుట్టు మిషన్’ పథకం షురూ.. పాలకుర్తిలో ప్రారంభం
  • 3వేల మందికి శిక్షణ
  • రూ.5 కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌ట‌న‌
  • మహిళల ఆర్థికాభివృద్ధి సాధ‌నే ల‌క్ష్యం
  • రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

విధాత, వరంగల్: మహిళా సాధికారత లక్ష్యంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, స్త్రీ నిధి సహకారంతో రాష్ట్రంలో మొదటిసారి పాలకుర్తిలో 3వేల‌ మంది మహిళలకు కుట్టు మిషన్ శిక్షణా కార్యక్రమాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. సోమవారం పాలకుర్తి నియోజకవర్గం కేంద్రంలో ఈ కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం శిక్షణ పొందే మహిళలు, స్థానిక నేతలు, సంబంధిత అధికారులతో క‌లిసి మంత్రి ఎర్రబెల్లి సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ సంఘంగా కాకుండా వ్యక్తిగతంగా లబ్ధి పొందేందుకు 30 రోజులు ఈ కుట్టు మిషన్ శిక్షణను ప్రారంభించామన్నారు. ఈ శిక్షణను మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మీ బ్యాచ్ రాబోయే వారికి ఆదర్శంగా మారాలని, దీని తర్వాత డిజైనింగ్‌లో కూడా శిక్షణ ఇస్తామని తెలిపారు.

నా ఆలోచనతో ఈ పథకం

నా ఆలోచనతో ఏర్పాటు చేసిన ఈ పథకం కింద మహిళలకు శిక్షణ ఇచ్చి, కుట్టు మిషన్లు ఇస్తామని చెబితే సీఎం దీవించారని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. సంగెం మండలంలో టెక్స్ టైల్ పార్క్ కు 10 వేల మంది అవసరముందని,
కొడకండ్లలో కూడా మినీ టెక్స్ టైల్ పార్క్ వస్తుందన్నారు. వీటి వల్ల మహిళలకు ఉపాధి, ఉద్యోగం లభిస్తుందని వివరించారు. ఇది కంటిన్యూ గా జరిగే శిక్షణ కార్యక్రమని స్పష్టం చేశారు.

మొత్తం రూ.5 కోట్లు ఖర్చు..

ఈ కుట్టు మిషన్ల శిక్షణ కోసం సెర్ప్ నుంచి రూ.10వేలు‌, స్త్రీ నిధి నుంచి రూ.7 వేల చొప్పున ఒకరిపై రూ.17వేల ఖర్చు చేస్తున్నామని, మొత్తం రూ.5 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం హాస్టళ్ల‌లో బట్టలు కుట్టే పని వేరే వారికి ఇస్తున్నామని ప్రభుత్వ పరంగా ఏ బట్టలు ఆర్డర్ ఇచ్చినా మనకే వచ్చేటట్లు చేస్తానని భరోసా ఇచ్చారు. తరవాత దశలో రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో జనగామ జిల్లా జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియ, జనగామ జిల్లా కలెక్టరు శివ లింగయ్య, అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, పిడి డి.ఆర్. డి. ఏ శ్రీరామ్ రెడ్డి, పాలకుర్తి దేవస్థాన చైర్మన్ రామచంద్రయ్య శర్మ, డీసీసీబీ వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర రెడ్డి, మాజీ చైర్మన్ గాంధీ నాయక్ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీలు సావిత్రి, జ్యోతి, సర్పంచ్ ఏకాంత రావు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.