సూర్యాపేటను నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతా: మంత్రి జగదీశ్ రెడ్డి

- బీఆర్‌ఎస్‌లోకి జోరుగా వలసలు
విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: సూర్యాపేట నియోజకవర్గంలో ఇదివరకు జరిగిన అభివృద్ధి ఆరంభం మాత్రమే అని, భవిష్యత్తులో నంబర్ వన్ గా తీర్చిదిద్దుతానని సూర్యాపేట శాసనసభ్యులు, మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. గురువారం ఆత్మకూర్ ఎస్ మండలం గట్టికల్ గ్రామంలోని షెడ్యూల్డ్ కులాలకు చెందిన 50 కాంగ్రెస్ కుటుంబాలతో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ నెంబర్ వన్ అన్నారు.
దళితుల ఆర్థికాభివృద్ధికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం దేశంలో ఎక్కడా లేదని అన్నారు. ఏ పార్టీల వల్ల తమ బతుకులు బాగుపడ్డాయో ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. 2014లో బీఆర్ఎస్ కు వేసిన ఓటు రూ. 7500 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందన్నారు. జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన చేరికల్లో బచ్చలకూరి శేఖర్, ఇరుగు నవీన్, బచ్చలకూరి కరుణాకర్, బచ్చలకూరి అరవింద్, గుర్రాల రాంబాబుతో పాటు పలువురు దళిత కుటుంబాలు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు.