అగ్గిపెట్టె దొరకని హరీష్ రావు ఆగమాగం మాట్లాడుతున్నాడు:సీతక్క
వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అగ్గిపెట్టె దొరకని హరీష్ రావు ఆగమాగం మాట్లాడుతున్నాడని, మంత్రిని కావడం నాకల...అందులో తప్పేముంది. బడుగు వర్గాలు మంత్రులు కావాద్దా? అంటూ ములుగు కాంగ్రెస్ అభ్యర్థి ధనుసరి సీతక్క ప్రశ్నించారు

- మంత్రి కావడం నాకల
- బడుగువర్గాలు మంత్రులు కావద్దా?
- దొరల తెలంగాణ కావాలా? ప్రజల వద్దకే పాలన కావాలా?
- బీఆర్ఎస్ నాయకులొస్తె తరిమికొట్టండి
- ములుగు కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అగ్గిపెట్టె దొరకని హరీష్ రావు ఆగమాగం మాట్లాడుతున్నాడని, మంత్రిని కావడం నాకల…అందులో తప్పేముంది. బడుగు వర్గాలు మంత్రులు కావాద్దా? అంటూ ములుగు కాంగ్రెస్ అభ్యర్థి ధనుసరి సీతక్క ప్రశ్నించారు. ములుగు మండలం కన్నాయి గూడెంలో ఆదివారం రాత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడారు.ఇంకా దొరల చేతిలో బంధీలుగా బతుకుదామా? దొరల తెలంగాణ కావాలా? ప్రజల వద్దకే పాలన అందించే కాంగ్రెస్ పార్టీ కావాలో ప్రజలే తేల్చుకోవాలని సూచించారు.
మనకు ఇల్లు, పోడు భూములకు పట్టాలు, మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వని బీఆర్ఎస్ నాయకులు మన ఇళ్లలోకి వస్తే తరిమికొట్టండంటూ పిలుపునిచ్చారు. నేను ప్రజల మనిషిని, ప్రజల కోసం పరితపించే వ్యక్తిని, ప్రజల పక్షాన నిలబడి కోట్లాడే వ్యక్తిని.. నన్ను ఓడించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ రూ.100 కోట్లను తమ బంట్రోతులకు ఇచ్చి డబ్బూ, మద్యంతో ములుగు నియోజకవర్గ ప్రజలను కొనడానికి పంపించారని విమర్శించారు.
ఎందుకు నాపైన ప్రభుత్వాన్నిఇంత కక్ష? నేను ప్రజలకు సేవ చేసినందుకా? ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకున్నందుకా? కరోనా సమయంలో ప్రజలకు సేవ చేసినందుకా? ఎందుకు నాపైన ఇన్ని కుట్రలో ఒక్కసారి ములుగు నియోజకవర్గ ప్రజలు ఆలోచన చెయ్యాలని కోరారు. మా ములుగు ప్రజలు బీఆరెస్ ఇచ్చే డబ్బులకు అమ్ముడు పోరు, ప్రజలారా బీఆర్ఎస్ నాయకులు ఇచ్చే డబ్బు తీసుకోండి, అవి గడిచిన 10 యేండ్లలో మనల్ని దోచుకున్న పైసలేనని అన్నారు.
కాగా.. వాళ్ళు డబ్బులను నమ్ముకున్నారు… నేను మిమ్ముల నమ్ముకున్నాను. వాళ్ళు గెలిస్తే డబ్బులు గెలిచినట్లు, నేను గెలిస్తే ములుగు ప్రజలు గెలిచినట్లన్నారు. మీ ఆడ బిడ్డను ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని సీతక్క అన్నారు. అనంతరం కన్నాయి గూడెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ వార్డు సభ్యులు కాంగ్రెస్ లో చేరగా, వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.