హరీష్‌రావుకు నా గ‌తే ప‌డుతుంది..మాజీ మంత్రి, బీజేపీ నేత రాజేందర్‌

విధాత,కమలాపూర్‌ : మంత్రి హ‌రీష్‌రావు గురించి మాజీ మంత్రి ఈట‌ల మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని మండలాలకు వస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాస్వామ్య బద్ధంగా ఓట్లు అడగాలే తప్ప నీచంగా వ్యవహరించొద్దని రాజేందర్‌ హితవు పలికారు. కమలాపూర్‌ కమ్యూనిటీ హాల్‌లో మంగళవారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘కొంత మంది ఎమ్మెల్యేలు బానిసలుగా ఉండవచ్చు.. ఇంత ఘోరంగా ఉంటారా.. మీకు మీరు ఆత్మవిమర్శ చేసుకోండి.. రేపు మీ నియోజకవర్గాల్లో మీ పరిస్థితి […]

హరీష్‌రావుకు నా గ‌తే ప‌డుతుంది..మాజీ మంత్రి, బీజేపీ నేత రాజేందర్‌

విధాత,కమలాపూర్‌ : మంత్రి హ‌రీష్‌రావు గురించి మాజీ మంత్రి ఈట‌ల మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని మండలాలకు వస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాస్వామ్య బద్ధంగా ఓట్లు అడగాలే తప్ప నీచంగా వ్యవహరించొద్దని రాజేందర్‌ హితవు పలికారు. కమలాపూర్‌ కమ్యూనిటీ హాల్‌లో మంగళవారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘కొంత మంది ఎమ్మెల్యేలు బానిసలుగా ఉండవచ్చు.. ఇంత ఘోరంగా ఉంటారా.. మీకు మీరు ఆత్మవిమర్శ చేసుకోండి.. రేపు మీ నియోజకవర్గాల్లో మీ పరిస్థితి కూడా ఇంతేనని గుర్తుంచుకోండి.. నన్ను విమర్శిస్తే సూర్యుడిపై ఉమ్మేసినట్లే.. మంత్రి హరీశ్‌రావు! ఇక్కడి నుంచి మందిని తీసుకుపోయి దావత్‌ ఇచ్చి డబ్బులు ఇయ్యడమే మీపనా.. ఆయన సీఎం దగ్గర మెప్పు పొందాలని చూస్తున్నాడు.. హ‌రీష్‌రావుకు కూడా నా గతే పడుతుంది..” అని హెచ్చరించారు. “కమలాపూర్‌ ఇన్‌చార్జ్‌ అయితే ఎక్కడ, ఎలా సంపాదించాడో తెలియదు.. ఆయన డబ్బులనే నమ్ముకున్నాడు. స్కూల్‌ను బార్‌గా మార్చిన నీకు కర్రు కాల్చి వాత పెడుతం బిడ్డా..” అని హెచ్చరించారు. “మీరు నాయకులను కొనవచ్చు కానీ ప్రజలను కొనలేరు.. అది మీకే కాదు కేసీఆర్‌ జేజమ్మకు కూడా సాధ్యం కాద”ని స్పష్టం చేశారు.