నల్గొండ: 2022లో తగ్గిన నేరాల సంఖ్య: SP రాజేశ్వరి

విధాత: నల్గొండ జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే నేరాల సంఖ్య 2022లో తగ్గిందని జిల్లా ఎస్పీ రేమా రాజేశ్వరి తెలిపారు. ఆమె ఈ ఏడాది క్రైమ్ రికార్డుల వివరాలను వెల్లడించారు. 2020లో 6754 నేరాలు నమోదు కాగా, 2021 లో 9535 నేరాలు, 2022లో 7343 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఈ ఏడాది దేవరకొండలో గిరిజన ప్రాంతాలలో అక్రమ దత్తత ద్వారా నవజాత శిశువులను విక్రయించే ఐదు మంది సభ్యులను అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. […]

నల్గొండ: 2022లో తగ్గిన నేరాల సంఖ్య: SP రాజేశ్వరి

విధాత: నల్గొండ జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే నేరాల సంఖ్య 2022లో తగ్గిందని జిల్లా ఎస్పీ రేమా రాజేశ్వరి తెలిపారు. ఆమె ఈ ఏడాది క్రైమ్ రికార్డుల వివరాలను వెల్లడించారు. 2020లో 6754 నేరాలు నమోదు కాగా, 2021 లో 9535 నేరాలు, 2022లో 7343 కేసులు నమోదైనట్లు వెల్లడించారు.

ఈ ఏడాది దేవరకొండలో గిరిజన ప్రాంతాలలో అక్రమ దత్తత ద్వారా నవజాత శిశువులను విక్రయించే ఐదు మంది సభ్యులను అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. అలాగే జిల్లా పరిధిలో కారులు, లారీల చోరీకి పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠాలను అరెస్ట్ చేసి రిమాండ్ చేశామన్నారు.

చైన్ స్నాచింగ్ ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్ చేశామని తెలిపారు. బస్సులలో దొంగతనాలు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠాను, అలాగే మోటార్ సైకిల్ చోరీల ముఠాను అరెస్టు చేసి రిమాండ్ చేశామన్నారు. ఆయా నేరాల్లో 2022 లో 44.19శాతం సొత్తును రికవరీ చేశామన్నారు.

23 గంజాయి కేసుల్లో 2795.856 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. సైబర్ క్రైమ్ , షీటీమ్స్ పై ప్రజల్లో అవగాహన పెంచడం జరిగిందన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ భరోసా సెంటర్ ను దేశంలోనే మొదటిసారిగా మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బాల కార్మిక నిర్మూలన, యాంటీ ర్యాగింగ్ ఆపరేషన్ చేపట్టి వాటి నివారణకు చర్యలు తీసుకున్నామన్నారు. పోలీస్ సంక్షేమం కోసం అవసరమైన అన్ని చర్యలు అమలు చేశామన్నారు.