ఓటర్ నమోదులో అధికారులు నిబద్దతతో పనిచేయాలి: ఎలక్ట్రోరల్ అధికారి నిర్మల
విధాత, మెదక్ బ్యూరో: నూతన ఓటరు నమోదు, ఓటరు జాబితా చేర్పులు, మార్పులు, తొలగింపులకు సంబంధించి వచ్చిన ప్రతి దరఖాస్తును నిశితంగా పరిశీలించి నిర్ధారించుకొన్న తర్వాత ఆన్ లైన్ లో వివరాలు నమోదు చేయాలని ఎలక్ట్రోరల్ రోల్ పరిశీలకురాలు నిర్మల సూచించారు. బుధవారం కలక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, ఆర్.డి.ఓ. సాయి రామ్ తో కలిసి జిల్లా వ్యాప్తంగా ఓటరు జాబితాలో సవరణలు, మార్పులు, చేర్పులు, […]

విధాత, మెదక్ బ్యూరో: నూతన ఓటరు నమోదు, ఓటరు జాబితా చేర్పులు, మార్పులు, తొలగింపులకు సంబంధించి వచ్చిన ప్రతి దరఖాస్తును నిశితంగా పరిశీలించి నిర్ధారించుకొన్న తర్వాత ఆన్ లైన్ లో వివరాలు నమోదు చేయాలని ఎలక్ట్రోరల్ రోల్ పరిశీలకురాలు నిర్మల సూచించారు.
బుధవారం కలక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, ఆర్.డి.ఓ. సాయి రామ్ తో కలిసి జిల్లా వ్యాప్తంగా ఓటరు జాబితాలో సవరణలు, మార్పులు, చేర్పులు, తొలగింపులు తదితర అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా రోల్ పరిశీలకురాలు నిర్మల మాట్లాడుతూ ఓటర్ల జాబితా రూపొందించడం ఆషామాషీ కాదని, ఎంతో నిబద్దతో పనిచేయాలని, ఏ చిన్న పొరపాటు జరిగినా ఓటరుకు అన్యాయం జరిగినట్లేనని అన్నారు. కొత్తగా ఓటర్ల నమోదుతో పాటు చనిపోయిన వారి పేర్లు తొలగించడంలో, డూప్లికేట్ పేర్లు తొలగించడంలో జాగరూకత వహిస్తూ జనవరి 5 న తుది జాబితా పారదర్శకంగా రూపొందించాలని సూచించారు.
మెదక్, నరసాపూర్ నియోజక వర్గాలలో ఫారం-6, ఫారం-6ఏ, ఫార్మల్-7, ఫారం-8 ద్వారా వచ్చిన అన్ని దరఖాస్తులను పరిశీలించి పెండింగు లేకుండా చూడాలన్నారు. ఓటర్ల నమోదుకు వచ్చిన దరఖాస్తులను బిఎల్ ఓ లు క్షేత్ర స్థాయిలో పరిశీలించి అన్ని సక్రమంగా ఉన్నాయని రూడి చేసుకున్న తరువాతే ఆన్ లైన్ లో నమోదు చేయాలని, రిజెక్ట్ చేసిన వాటికీ సరైన కారణాలు పేర్కొనాలని సూచించారు.
ఈఆర్వోలు తమ నియోజకవర్గాల్లో ఓటరు నమోదు ప్రక్రియ, జాబితాలో పేర్ల నమోదుతో పాటు సవరణలు, మార్పులు, చేర్పులు, తొలగింపులను జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. కంప్యూటర్ మిస్టేక్స్ జరుగకుండా, ఓటరు జాబితాలో పేర్లు తొలగిపోకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎలక్టోరల్ అధికారి, రోల్ పరిశీలకుల లాగిన్ లో ఉన్న ఫారం –6, 7, 8 లకు సంబంధించి సూపర్ చెక్ దరఖాస్తులను పరిశీలించి తగు సూచనలు చేశారు.
జిల్లాలో ఓటరు నమోదు ప్రక్రియతో పాటు, ఆధార్ అనుసంధానం, ఓటరు అవగాహన కార్యక్రమాలు బాగున్నాయని కితాబిచ్చారు. ఈఆర్వోలు, బూత్ లెవల్ ఆఫీసర్లకు ఏమైనా ఇబ్బందులు ఉంటె వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని నిర్మల సూచించారు.
అనంతరం అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ మాట్లాడారు. బూత్ స్థాయి అధికారి క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన ఓటరు వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేస్తున్నారని, మరణించిన వారి పేర్లను కుటుంభం సభ్యులను విచారించి నోటీసులు ఇచ్చి తొలగిస్తున్నామని తెలిపారు.
అదేవిధంగా అర్హులైన ట్రాన్స్ జెండర్లు, దివ్యాంగులను ఓటరుగా నమోదు చేయుటకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పట్టణాలలో నివాసం ఉంటున్నప్పటికీ గ్రామంలో కూడా ఓటు హక్కుతో రెండు ప్రాంతాల్లో ఓటరుగా నమోదు చేసుకున్న వివరాలు క్షేత్రస్థాయిలోపరిశీలించి తొలగింపునకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
సమావేశంలో స్వీప్ నోడల్ అధికారి రాజి రెడ్డి, తహసీల్ధార్లు, బి.ఎల్.ఓ. లు , ఎలక్షన్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.