రైతు బంధు అడ్డుకుంటున్న కాంగ్రెస్ ను బొంద పెట్టాలి: పద్మా దేవేందర్ రెడ్డి

రైతుబంధును అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు

రైతు బంధు అడ్డుకుంటున్న కాంగ్రెస్ ను బొంద పెట్టాలి: పద్మా దేవేందర్ రెడ్డి

విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: రైతుబంధును అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని జంగారాయి, చందాపూర్, మల్లుపల్లి, రుద్రారం, చందంపేట గ్రామాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామ గ్రామాన ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బోనాలు, బతుకమ్మలు. మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. చందాపూర్ లో పోతురాజులతో డప్పులు, డోలు వాయిద్యాలతో టపాసులు కాలుస్తూ, పూల వర్షం కురిపిస్తూ పద్మా దేవేందర్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు.


ఈ సందర్భంగా పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ 24 గంటలు కరెంటు ఇస్తున్న బీఆర్ఎస్ కు ఓటు వేస్తారో.. మూడు గంటలు కరెంటు ఇస్తామంటున్న కాంగ్రెస్ కు ఓటు వేస్తారో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. 11 సార్లు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే తెలంగాణ ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత కరెంటును అందిస్తున్నారని తెలిపారు. రైతుబంధు, రైతు బీమా వంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు.



 


రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మైనంపల్లి హనుమంతరావు మెదక్ ప్రజలకు ఏమి అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. గత 13 ఏళ్ల నుండి మెదక్ ప్రజలకు దూరం ఉండి ఎన్నికల సమయంలో వచ్చి ప్రజలను ఓట్లు అడిగితే ఎలా వేస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కు ఓటు వేస్తే అసైన్మెంట్ భూములకు పట్టాలు ఇస్తామన్నారు. ఆడబిడ్డగా ఆశీర్వదించాలని, మరింత అభివృద్ధి చేస్తానన్నారు. నై తెలంగాణ అన్న మైనంపల్లికి ఓటేస్తారో, జై తెలంగాణ అన్న పద్మాదేవేందర్ రెడ్డికి ఓటు వేస్తారో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు.


ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పీ శశిధర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏకే గంగాధరరావు, మెదక్ నియోజకవర్గ ఇన్చార్జి కాంటారెడ్డి తిరుపతిరెడ్డి, నాయకులు నందు జనార్దన్ రెడ్డి, జడ్పీటీసీ పట్లూరి మాధవి, మాజీ జడ్పీటీసీ పీహెచ్ రమణ, మండల రైతు బంధు అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, మండల శాఖ అధ్యక్షుడు రాజు, వైస్ ఎంపీపీ సత్యనారాయణ గౌడ్, సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షుడు పూలపల్లి యాదగిరి యాదవ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు శివకుమార్, సర్పంచులు బందేల్ల జ్యోతి, పడాల రమాదేవి, లక్ష్మణ్, శ్రీలత, సింగిల్ విండో చైర్మన్లు అంజిరెడ్డి, సత్యనారాయణ, నాయకులు కుమార్ గౌడ్, రమేష్, మైనంపల్లి రాధా కిషన్ రావు, రమేష్ రావు, వెంకటేశం, లక్ష్మణ్, నాగరాజు, గణేష్, ఉప్పరి శ్రీను, లింగారెడ్డి, ప్రభాకర్, హేమచంద్రం, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ చైర్మన్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.