ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా పటేల్ రమేష్ రెడ్డి
సూర్యాపేట కాంగ్రెస్ టికెట్ ఆశించి బంగపడిన పటేల్ రమేష్ రెడ్డి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

విధాత: సూర్యాపేట కాంగ్రెస్ టికెట్ ఆశించి బంగపడిన పటేల్ రమేష్ రెడ్డి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. శుక్రవారం భారీ ర్యాలీతో తన నామినేషన్ దాఖలు చేశారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ బీ ఫామ్ సమర్పించిన పటేల్ రమేష్ రెడ్డి సింహం గుర్తుపై పోటీ చేస్తున్నారు.
దీంతో ఇప్పటికే సూర్యాపేట నియోజకవర్గంలో మంత్రి జి. జగదీశ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా, మాజీ మంత్రి ఆర్. దామోదర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు బిజెపి అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.
బీఎస్పీ నుంచి బీఆర్ఎస్ బహిష్కృత నేత జగదీశ్ రెడ్డి మాజీ అనుచరుడు వట్టె జానయ్య యాదవ్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పటేల్ రమేష్ రెడ్డిలు పోటీలో ఉన్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో బహుముఖ పోటీ మరోసారి జగదీశ్ రెడ్డికి కలిసి వస్తుందని భావిస్తున్నారు.