తెలంగాణపై ప్రధాని మోడీ నజర్‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా మూడు రోజులు బీజేపీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు

తెలంగాణపై ప్రధాని మోడీ నజర్‌
  • వరుసగా మూడు రోజుల పర్యటన


విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా మూడు రోజులు బీజేపీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈనెల 25న కరీంనగర్ సభలో, 26న నిర్మల్ సభలో మోడీ పాల్గొని ప్రసంగిస్తారు. 27న హైదరాబాద్‌లో రోడ్ షోలో పాల్గొనున్నారు. ఎల్భీ నగర్ నుంచి పటాన్ చెరు వరకు మోడీ రోడ్ షో నిర్వహించనున్నట్లుగా తెలుస్తుంది.


ప్రధాని పర్యటన షెడ్యూల్ ఖరారు కావడంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆయన పర్యటన విజయవంతం సన్నాహాల్లో నిమగ్నమైంది. ప్రధాని మోడీ ఇప్పటికే పాలమూరు, ఇందూరు బహిరంగ సభలలో, అలాగే ఎల్భీ స్టేడియంలో బీజేపీ బీసీ సభకు హాజరవ్వగా, శనివారం సాయంత్రం మాదిగల విశ్వరూప సభకు హాజరవుతున్నారు.