యాదాద్రి భువనగరి జిల్లా: యాజ‌మాన్య ప‌ద్ధ‌తుల‌తో నాణ్య‌మైన మొక్కల ఉత్పత్తి: BNరావు

విధాత: నర్సరీ యాజ‌మాన్యం యాజమాన్య పద్ధతులను సక్రమంగా పాటించి నాణ్యమైన మొక్కలను ఉత్పత్తి చేయాల‌ని తెలంగాణ ప్రభుత్వ ఆయిల్ ఫామ్ సలహాదారు బిఎన్. రావు సూచించారు. మంగళవారం యాదాద్రి భువనగరి జిల్లా మోత్కూర్ పాలడుగు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కంపెనీ ఆయిల్ పామ్ న‌ర్సరీని ఆయన సందర్శించారు. ప్రాథమిక, ద్వితీయ న‌ర్సరీలను పరిశీలించి నాణ్యమైన మొక్కలను ఉత్పత్తి చేసేందుకు పాటించవలసిన జాగ్రత్తలను నర్సరీ యజమాన్యానికి సూచించారు. ప్రతి దశలో గుర్తించిన అబ్ నార్మల్ మొక్కలను […]

యాదాద్రి భువనగరి జిల్లా: యాజ‌మాన్య ప‌ద్ధ‌తుల‌తో నాణ్య‌మైన మొక్కల ఉత్పత్తి: BNరావు

విధాత: నర్సరీ యాజ‌మాన్యం యాజమాన్య పద్ధతులను సక్రమంగా పాటించి నాణ్యమైన మొక్కలను ఉత్పత్తి చేయాల‌ని తెలంగాణ ప్రభుత్వ ఆయిల్ ఫామ్ సలహాదారు బిఎన్. రావు సూచించారు. మంగళవారం యాదాద్రి భువనగరి జిల్లా మోత్కూర్ పాలడుగు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కంపెనీ ఆయిల్ పామ్ న‌ర్సరీని ఆయన సందర్శించారు.

ప్రాథమిక, ద్వితీయ న‌ర్సరీలను పరిశీలించి నాణ్యమైన మొక్కలను ఉత్పత్తి చేసేందుకు పాటించవలసిన జాగ్రత్తలను నర్సరీ యజమాన్యానికి సూచించారు. ప్రతి దశలో గుర్తించిన అబ్ నార్మల్ మొక్కలను కిల్లింగ్ చేసి వాటిని వెంటనే ధ్వంసం చేయమని సూచించారు.

మొక్కల పెంపకానికి రోజు వారీ చేపడుతున్న చర్యలను, సరఫరా చేయవలసిన మొక్కల వివరాలు ఖచ్చితంగా రిజిస్టర్లో నమోదు చేయాలని ఆదేశించారు. ప్రాథమిక నర్సరీలో మొక్కలను 3 నెలలు ఉంచి తదనంతరం ద్వితీయ నర్సరీకి మార్చాలని సూచించారు. అదే విధముగా రెండు రకాల నర్సరీలలో రెండు వరుసల మధ్య దూరం 75 సెంటీ మీటర్లు ఖచ్చితంగా పాటించాలని సూచించారు.

ఆరోగ్యవంతమైన మొక్కకు ఉండవలసిన నాణ్యతా ప్రమాణాలతో మొక్కలను రైతులకు అందజేయాలని ఆదేశించారు. తదుపరి చౌటుప్పల్ మండలంలోని తంగడపల్లి గ్రామములో B.N. గౌడ్, A. రాజేశ్వర రావు గార్ల ఆయిల్ పామ్ తోటలు సందర్శించి తగిన సూచనలు, సలహాలు అందించారు.

ఈ సందర్శనలో భాగంగా జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి శ్రీమతి G.అన్నపూర్ణ గారు, చౌటుప్పల్ ఉద్యానాధికారి K.కవిత, మోత్కూర్ ఉద్యానాధికారి Sk. నసీమా, నర్సరీ ఇంఛార్జ్ జాన్ రాథోడ్, ఆయిల్ ఫెడ్ ఫీల్డ్ అసెంట్ హరీష్, రైతులు, నర్సరీ సబ్బంది పాల్గొన్నారు.