విధాత: గ్రూప్ 2అభ్యర్థి, నిరుద్యోగి ప్రవళిక ఆత్మహత్యపై ట్వీట్టర్ వేదిగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితల మధ్య పరస్పర ఆరోపణలు, విమర్శల వార్ సాగింది. ముందుగా రేవంత్ ప్రవళిక ఆత్మహత్యపై తన ట్వీట్లో అమ్మా ప్రవళిక ఎన్నో అగ్ని పరీక్షలు ఎదుర్కొని ఇంత దూరం వచ్చిన దానివి మరికొంత ఆత్మస్థైర్యాన్ని కూడదీసుకోలేకపోయావా? నువ్వు కన్న కలల కోసం మరికొన్నాళ్లు వేచి ఉండలేకపోయావా? నిన్ను కన్నవారి కళ్లల్లో ఆనందం చూడాలన్న సంగతిని మరిచిపోయావా ఎంతోమందికి దారి చూపాలనుకున్నదానివి.. ఇలా అర్ధాంతరంగా నీ ప్రయాణం ముగిస్తావా? భగవంతుడు నీ ఆత్మకు శాంతిని చేకూర్చాలని ప్రార్థిస్తూ..యువతీ, యువకుల్లారా! ఆత్మహత్యలు వద్దు.. మీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు! మన భవిష్యత్తుతో చెలగాటం ఆడిన ఈ నక్కలు ఎక్కడ నక్కినా గుంజుకొచ్చి దోషులుగా నిలబెడదాం. వీళ్ళ నక్క జిత్తులను నడి రోడ్డులో నిలబెట్టి తరిమికొడదామన్నారు.
అమ్మా ప్రవళిక..
ఎన్నో అగ్ని పరీక్షలు ఎదుర్కొని ఇంత దూరం వచ్చిన దానివి..
మరికొంత ఆత్మస్థైర్యాన్ని కూడదీసుకోలేకపోయావా?నువ్వు కన్న కలల కోసం మరికొన్నాళ్లు వేచి ఉండలేకపోయావా?
నిన్ను కన్నవారి కళ్లల్లో ఆనందం చూడాలన్న సంగతిని మరిచిపోయావా?ఎంతోమందికి దారి చూపాలనుకున్నదానివి..
ఇలా… pic.twitter.com/IABLFChyho— Revanth Reddy (@revanth_anumula) October 14, 2023
దీనికి కౌంటర్‌గా ఎమ్మెల్సీ కవిత తన ట్వీట్లో బతుకమ్మ చేస్తాం..బాధను కూడా పంచుకుంటాం..
తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను కించపరచడం ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమన్నారు. ఆడబిడ్డ ఆత్మహత్య చేసుకుంటే సానుభూతి వ్యక్తం చేయడం పోయి రాజకీయం చేయడం మీ విధానమా ? ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం విచారకరం. ఏ తల్లిదండ్రులకు ఇలాంటి పరిస్థితి రాకూడదన్నారు.
నోటిఫికేషన్లకు మోకాలడ్డుతూ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నదే కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో ఏ ఒక్క ఉద్యోగం నోటిఫికేషన్ జారీ అయినా దాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేసింది వాస్తవం కాదా ? మీ కుట్రలకు బద్దలు కొట్టి లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత సీఎం కేసీఆర్ గారిది. చివరికి గ్రూప్ 2 ని వాయిదా వేయాలని మీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీధర్ బాబు అసెంబ్లీలో డిమాండ్ చేయడమే కాకుండా మీరు కూడా ట్వీట్టర్లో డిమాండ్ చేయలేదా ? శవాల మీద పేలాలు ఏరుకోవడం మీకు, మీ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య, హత్య చేసిన వాళ్లే ఓదార్చుతున్నట్లు ఉంది మీ వ్యవహార శైలి అంటూ మండిపడ్డారు.
బతుకమ్మ చేస్తాము..
బాధను కూడా పంచుకుంటాము..
తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను కించపరచడం ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యం…ఆడబిడ్డ ఆత్మహత్య చేసుకుంటే సానుభూతి వ్యక్తం చేయడం పోయి రాజకీయం చేయడం మీ విధానమా ? ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం విచారకరం. ఏ… https://t.co/ET9YmGPsPW pic.twitter.com/i5Alelsakh
— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 14, 2023
ప్రతిగా మళ్లీ రేవంత్ కవితకు రీకౌంటర్ చేశారు. లక్షలాది ఉద్యోగాల భర్తీ అంటే ఎంపీగా ఓడిన మీకు ఆగమేఘాల పై ఎమ్మెల్సీ పదవి ఇచ్చి భర్తీ చేయడమా ?..లక్షలాది ఉద్యోగాల భర్తీ అంటే టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాలు లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమా ? లక్షలాది ఉద్యోగాల భర్తీ అంటే ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా సరిగా నిర్వహించలేక విద్యార్థుల ఉసురుపోసుకోవడమా ? ఉత్త మాటలు, ఎదురు దాడులు కాదు ఎన్ని లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారో, ఎన్ని లక్షల ఖాళీలు ఉన్నాయో, ఆ ఖాళీలు ఎందుకు భర్తీ చేయలేదో శ్వేతపత్రం విడుదల చేయించండంటూ రేవంత్ సవాల్ చేశారు.