23న సింగరేణి ఆవిర్భావ దిన వేడుకలు

సింగరేణి ఆవిర్భావ దిన వేడుకలను ఈనెల 23న నిర్వహిస్తుండగా, ఘనగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సింగరేణి ఆర్జీ వన్ జీఎం చింతల శ్రీనివాస్ తెలిపారు

23న సింగరేణి ఆవిర్భావ దిన వేడుకలు

– ఆర్జీ వన్ జీఎం చింతల శ్రీనివాస్

– జవహర్ లాల్ నెహ్రూ మైదానంలో ఏర్పాట్లు

విధాత ప్రతినిధి, పెద్దపల్లి: సింగరేణి ఆవిర్భావ దిన వేడుకలను ఈనెల 23న నిర్వహిస్తుండగా, ఘనగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సింగరేణి ఆర్జీ వన్ జీఎం చింతల శ్రీనివాస్ తెలిపారు. బుధవారం సింగరేణి ఆర్జీ వన్ జీఎం కార్యాలయంలో వేడుకలపై అన్ని గనులు, విభాగాల ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లడుతూ రామగుండం ఏరియా-1లోని స్థానిక జవహర్ లాల్ నెహ్రూ క్రీడా మైదానంలో వేడుకలకు పకడ్బందీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శాఖల వారిగా కేటాయించిన వాటిని అధికారులందరూ సమన్యయంతో నిర్ణయించిన గడువులోగా పూర్తి చేయాలని తెలిపారు. మైదానంలో ప్రత్యేక ఆకర్షణగా బొగ్గు తీయు యంత్రాల పనిముట్ల నమూనాలు ప్రదర్శించాలని, అటవీ, పర్యావరణ, వైద్య సేవలు, సింగరేణి సేవా సమితి స్టాళ్ళను ఏర్పాటు చేయాలని సూచించారు.


ఉత్తమ కార్మికుల ఎంపిక, స్వయం ఉపాధి పొందుతున్న మహిళల ఎంపిక, ఉత్తమ సింగరేణి గృహాల ఎంపిక, ఆకట్టుకునే సాంస్కృతిక కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జీఎం రామ్ మోహన్, ఏజీఎం పర్సనల్ లక్ష్మి నారాయణ, ఏజెంట్ బానోతు సైదులు, ఏజీఎం ఈ అండ్ ఎం రాం మూర్తి, డీజీఎం ఫైనాన్స్ ఎస్ ధనలక్ష్మి, డీజీఎం సివిల్ నాగేశ్వర్ రావు, డీజీఎం క్వాలిటి శ్రీధర్, డీజీఎం ఏరియా వర్క్ షాప్ మదన్ మోహన్, సర్వే అధికారి ప్రభాకర్, ఎస్టేట్ మేనేజర్ బాల సుబ్రమణ్యం, పర్చేస్ అధికారి శ్రీనివాస్, సీనియర్ సెక్యూరిటీ అధికారి వీరా రెడ్డి, పర్సనల్ మేనేజర్ కిరణ్ కుమార్, వసంత్ కుమార్, అభిలాష్, సీనియర్ పీఓ బంగారు సారంగ పాణి పాల్గొన్నారు.