చేయి గుర్తుకు ఓటేస్తే బతుకులు బాగుంటాయి: ఎన్నం శ్రీనివాస్ రెడ్డి

చేయి గుర్తుకు ఓటేస్తే బతుకులు బాగుంటాయి: ఎన్నం శ్రీనివాస్ రెడ్డి

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: పాలమూరు కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నం శ్రీనివాసరెడ్డి శనివారం పట్టణంలోని కూరగాయల మార్కెట్ ప్రాంతంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కూరగాయలు అమ్ముతున్న చిరు వ్యాపారులతో వారి సాధకబాధకాలు అడిగి తెలుసుకున్నారు.


ప్రచార కరపత్రం అందిస్తూ, కాంగ్రెస్ ను గెలిపిస్తే చేయబోయే పనులు, అభివృద్ధి, సంక్షేమపథకాలు

వివరించారు. ఆకుకూరలు అమ్ముతున్న ఓ వృద్ధురాలితో ఎన్నం మాట్లాడుతూ ‘అవ్వా బాగున్నావా… కూరగాయలు కిలో ఎంతకు అమ్ముతున్నావు.. రోజూ ఎన్ని రూపాయలు మిగులుతున్నాయి.


ఇప్పుడు మీకు పింఛన్ తక్కువ వస్తుంది.. కాంగ్రెస్ పార్టీ వస్తే మీలాంటి పేద వారి కోసం ఆరు గ్యారంటీల పథకం వస్తుంది. అప్పుడు మీకు అన్ని వసతులు వస్తాయి… మీ బాగుకోసమే కాంగ్రెస్ మంచి పథకం తీసుకొచ్చింది. మీ ఓటు చేయి గుర్తుకు వేస్తే బతుకులు బాగుంటాయి…’ అంటూ ఎన్నం శ్రీనివాసరెడ్డి చెప్పుకొచ్చారు.