అంగరంగ వైభవంగా శ్రీనివాసుడి శోభాయాత్ర.. పాల్గొన్న మంత్రి జగదీష్‌రెడ్డి
కోలాటం, భజన చేసి సందడి చేసిన మంత్రి జగదీష్ రెడ్డి విధాత: సూర్యాపేట జిల్లా కేంద్రంలో గోవింద మాల భక్త బృందం నిర్వహించిన శ్రీనివాస శోభాయాత్ర మంగళవారం అంగరంగ వైభవంగా సాగింది. గోవింద మాల మండల పూజ అనంతరం పేట పుర వీధులలో సాగిన వేంకటేశ్వర స్వామి శోభా యాత్రలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. గోవింద మాల భక్త బృందంతో కలిసి భక్తి పారవశ్యంలో మునిగిన మంత్రి కోలాటాలు, భజనలు […]

- కోలాటం, భజన చేసి సందడి చేసిన మంత్రి జగదీష్ రెడ్డి
విధాత: సూర్యాపేట జిల్లా కేంద్రంలో గోవింద మాల భక్త బృందం నిర్వహించిన శ్రీనివాస శోభాయాత్ర మంగళవారం అంగరంగ వైభవంగా సాగింది. గోవింద మాల మండల పూజ అనంతరం పేట పుర వీధులలో సాగిన వేంకటేశ్వర స్వామి శోభా యాత్రలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పాల్గొన్నారు.
గోవింద మాల భక్త బృందంతో కలిసి భక్తి పారవశ్యంలో మునిగిన మంత్రి కోలాటాలు, భజనలు చేసి సందడి చేశారు. ధనుర్మాసం ముక్తికి మార్గం… మార్గశిరం శ్రీమన్నారాయణుడి ఆరాధనతోపాటూ పలు పర్వదినాల సమాహారం మార్గశిర మాసం అన్నారు.
మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో చేసే పూజలూ, ఉండే ఉపవాసాలతో సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలచార్యులు, గోవింద మాలా ధారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.