టీఎ­స్‌­పీ­ఎస్సీ ప్రక్షా­ళ­నపై ప్రతి­ష్ఠం­భన

రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది డిసెం­బర్‌ కల్లా రెండు లక్షల ఉద్యో­గాలు భర్తీ చేస్తా­మని ప్రక­టిం­చింది. ప్రశ్న­ప­త్రాల లీకేజీ, పరీ­క్షల రద్దు వల్ల ఆగి­పో­యిన

టీఎ­స్‌­పీ­ఎస్సీ ప్రక్షా­ళ­నపై ప్రతి­ష్ఠం­భన
  • చైర్మన్‌, ముగ్గురు సభ్యుల రాజీ­నా­మాలు
  • ఇంకా ఆమో­దిం­చని గవ­ర్నర్‌ తమి­ళిసై
  • ప్రశ్న­ప­త్రాల లీకేజీ ఉదం­తం­తోనే జాప్యం!
  • రాజీ­నా­మా­లకు మరో ఇద్దరు తిర­స్కారం
  • కమి­ష­న్‌ను తొల­గించే అవ­కాశం లేని రాష్ట్రం
  • రాష్ట్ర­పతి చేతి­లోనే తొల­గింపు అధి­కారం
  • ఆచి­తూచి వ్యవ­హ­రి­స్తున్న రేవంత్‌ సర్కార్‌

విధాత ప్రత్యేకం: రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది డిసెం­బర్‌ కల్లా రెండు లక్షల ఉద్యో­గాలు భర్తీ చేస్తా­మని ప్రక­టిం­చింది. ప్రశ్న­ప­త్రాల లీకేజీ, పరీ­క్షల రద్దు వల్ల ఆగి­పో­యిన పరీ­క్షల నిర్వ­హణ సర్వీస్‌ కమి­షన్‌ పరి­ధిలో ఉంటుంది. అది రాజ్యాం­గ­బ­ద్ధ­మైన సంస్థ కాబట్టి అందులో ప్రభుత్వ జోక్యం ఉండదు. ప్రశ్న­ప­త్రాల లీకేజీ ఉదంతం, సర్కారు మారిన నేప­థ్యంలో చైర్మన్‌ జనా­ర్ద­న్‌­రెడ్డి, మరో ముగ్గురు సభ్యులు రాజీ­నామా చేశారు. దీనిపై గవ­ర్నర్‌ ఇప్ప­టికీ ఎలాంటి నిర్ణయం తీసు­కో­లేదు. చైర్మ­న్‌­తో­పాటు సభ్యులు వ్యక్తి­గత కార­ణా­లతో రాజీ­నామా చేసి ఉంటే గవ­ర్నర్‌ ఇప్ప­టికే ఆమోదం తెలి­పే­వారు. కానీ ప్రశ్న­ప­త్రాల లీకేజీ వ్యవ­హా­రంతో ఈ సమస్య ముడి­పడి ఉన్నది.


కాబట్టి వారి రాజీ­నామా ఆమో­దంపై గవ­ర్నర్‌ ఆచి­తూచి వ్యవ­హ­రి­స్తు­న్నారు. న్యాయ­ప­ర­మైన సమ­స్యలు తలె­త్త­కుండా జాగ్ర­త్తలు తీసు­కుం­టు­న్నారు. అలాగే సర్వీస్‌ కమి­ష­న్‌లో మరో ఇద్దరు సభ్యులు రాజీ­నామా చేయ­డా­నికి ససే­మిరా అంటు­న్నారు. వీళ్లను తొలి­గించే అధి­కారం కూడా గవ­ర్న­ర్‌కు ఉండదు. సర్వీస్‌ కమి­షన్‌ సభ్యు­లపై ఏమైనా ఆరో­ప­ణలు వస్తే వాటి ఆధా­రంగా వారిని తొలి­గించే అధి­కారం రాష్ట్ర­ప­తికి మాత్రమే ఉంటుంది. అలాగే పరీక్ష నిర్వ­హణ, ఫలి­తాలు ప్రక­టిం­చా­లన్నా అది సర్వీస్‌ కమి­షన్‌ పరి­ధి­లోనే ఉంటుంది. కాబట్టి నిరు­ద్యో­గు­లకు రాష్ట్ర ప్రభుత్వ ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ నోటి­ఫి­కే­షన్లు ఇవ్వా­లన్నా, రాష్ట్ర ప్రభుత్వం చెబు­తు­న్నట్టు కొత్త బోర్డు ఏర్పాటు చేయా­లంటే ఈ సమ­స్య­లన్నీ ఉన్నాయి. అలాగే ప్రశ్న­ప­త్రాల లీకేజీ వ్యవ­హా­రంపై సిటింగ్‌ జడ్జితో విచా­రణ చేయి­స్తా­మని ప్రభుత్వం ఇప్ప­టికే ప్రక­టిం­చింది.

జాబ్‌ క్యాలెం­డరే ప్రధాన అజెండా

కాంగ్రెస్‌ ప్రభుత్వం జాబ్‌ క్యాలెం­డర్‌ ప్రక­టి­స్తా­మని చెప్పింది. అయితే సర్వీస్‌ కమి­షన్‌ చైర్మన్‌, ముగ్గురు సభ్యులు రాజీ­నామా చేసి­న­ప్ప­టికీ అవి ఆమోదం పొంద­లేదు కనుక చేశారు కానీ వారి రాజీ­నా­మాలు ఆమోదం పొంద­లేదు కనుక ప్రస్తుత కమి­ష­న్‌­తోనే జాబ్‌ క్యాలెం­డర్‌ ప్రక­టిం­చ­వచ్చు. జాబ్‌ క్యాలెం­డర్‌ ప్రక­టిం­చి­న­ప్పుడు పోస్టులు, ఏ పరీక్ష ఎప్పుడు నిర్వ­హి­స్తా­మ­న్నది స్పష్టంగా పేర్కొ­నాల్సి ఉంటుంది. అయితే.. జాబ్‌ క్యాలెం­డర్‌ ప్రక­టించే ముందే కమి­షన్‌ ప్రక్షా­ళన, కొత్త కమి­షన్‌ ఏర్పా­టుపై ప్రభుత్వం కస­రత్తు మొద­లు­పె­ట్టింది. ఈ నేప­థ్యం­లోనే తెలం­గాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమి­ష­న్‌ను పక­డ్బం­దీగా తీర్చి­దిద్ది, ప్రశ్న­ప­త్రాల లీకేజీ లేకుండా చేస్తా­మని సీఎం రేవం­త్‌­రెడ్డి గతం­లోనే ప్రక­టిం­చారు. ఈ మేరకు సీఎం రేవం­త్‌­రెడ్డి, మంత్రి ఉత్త­మ్‌­కు­మా­ర్‌­రెడ్డి, సీఎస్‌ శాంతి­కు­మా­రి­లతో పాటు ఐఏ­ఎస్‌ అధి­కా­రులు వాణి­ప్ర­సాద్‌, అనితా రామ­చం­ద్రన్‌, నదీ­మ్‌లు యూపీ­ఎస్సీ చైర్మన్‌ మనోజ్‌ సోనీతో భేటీ అయ్యారు. పరీ­క్షల నిర్వ­హ­ణలో యూపీ­ఎస్సీ అను­స­రి­స్తున్న విధా­నా­లను తెలు­సు­కు­న్నారు.


అంతకు ముందు సర్వీస్‌ కమి­షన్‌ కార్య­దర్శి కేరళ రాష్ట్రా­నికి వెళ్లి అక్కడి సర్వీస్‌ కమి­షన్‌ విధా­నా­లను అధ్య­యనం చేసి వచ్చారు. కేరళ రాష్ట్ర కమి­షన్‌ విధా­నాలు ఇక్కడ అమలు చేయడం సాధ్యం కాదు. ఎందు­కంటే అక్కడ రాష్ట్ర సర్వీస్‌ కమి­ష­న్‌కు అను­బం­ధంగా మూడు ప్రాంతీయ కమి­షన్‌ కార్యా­ల­యాలు, 14 జిల్లా కార్యా­యాలు కూడా పని­చే­స్తాయి. అలాగే అక్కడ రెండేళ్ల తర్వాత రిటైర్‌ అయ్యే రోజునే కొత్త వ్యక్తి ఉద్యో­గంలో చేరేలా నియ­మా­కాలు చేప­డు­తుం­టారు. ఇక్కడ అలాంటి విధానం అమలు చేయడం అంత తేలిక కాదని నిపు­ణులు చెబు­తు­న్నారు.

కొత్త నోటి­ఫి­కే­ష­న్లకు ఇవీ సమ­స్యలు

ప్రస్తుతం సర్వీస్‌ కమి­షన్‌ పరి­ధిలో ఉన్న సుమారు 26 నోటి­ఫి­కే­ష­న్లలో 20 వరకు విడు­ద­ల­య్యాయి. మిగి­లిన వాటిని విడు­దల చేయా­లంటే మెలిక ఉన్నది. చైర్మన్‌, ముగ్గురు సభ్యుల రాజీ­నా­మా­లను ఆమో­దిం­చాక, మిగి­లిన ఇద్ద­రిలో ఇద్ద­రిలో సీని­యా­రిటీ ప్రకారం ఒక­రికి ఆ బాధ్యత అప్ప­గించి, ప్రక్రి­యను ముందుకు తీసు­కె­ళ్ల­వ­చ్చని నిపు­ణులు చెబు­తు­న్నారు. గ్రూప్‌ 1, 2 పోస్టుల సంఖ్య పెంచా­లంటే అను­బం­ధంగా నోటి­ఫి­కే­షన్‌ విడు­దల చేయాలి. లేదా ప్రస్తుతం ఇచ్చిన నోటి­ఫి­కే­షన్‌ రద్దు చేసే అధి­కారం కమి­ష­న్‌కు ఉంటుంది. దీనిపై ఏక­ప­క్షంగా నిర్ణ­యాలు తీసు­కుంటే తర్వాత న్యాయ­ప­ర­మైన వివా­దాలు తలెత్తే అవ­కాశం ఉన్నది. అందుకే ఈ విష­యంలో ముందుకు వెళ్ల­టా­నికి ప్రభు­త్వా­నికి ఇబ్బం­దులు ఎదు­ర­వు­తు­న్నాయి. అయితే ఇవన్నీ తాత్కా­లి­క­మే­నని, త్వర­లోనే ఈ సమ­స్య­ల­న్నీం­టికి పరి­ష్కారం దొర­ను­న్న­దని పరి­శీ­ల­కులు చెబు­తు­న్నారు.

కమి­ష­న్‌లో సిబ్బంది కొరత

కమి­ష­న్‌లో సిబ్బంది కొరత ఉన్నది. సిబ్బంది కొరత వల్ల ఉద్యోగ నియా­మక ప్రక్రి­యలో తీవ్ర జాప్యం జరు­గు­తు­న్నది. కమి­ష­న్‌లో మొత్తం 341 సిబ్బంది ఉండా­లంటే ప్రస్తుత ప్రభుత్వం మరో 176 పోస్టు­లను మంజూరు చేసి నియ­మిం­చాలి. అయితే ఆ నోటి­ఫి­కే­షన్‌ కూడా సర్వీస్‌ కమి­షనే ఇవ్వాల్సి ఉంటుంది. దర­ఖా­స్తుల స్వీక­రణ, పరీక్ష కేంద్రాల గుర్తింపు, అభ్య­ర్థు­లకు కేంద్రాల కేటా­యింపు, ప్రాథ­మిక, ఫైనల్‌ కీ వెల్లడి, మూల్యాం­కనం, 1:2 నిష్ప­త్తిలో జాబితా ప్రక­టన, తర్వాత ధ్రువీ­క­రణ పత్రాల పరి­శీ­ల­నలు, న్యాయ­వి­వా­దాల పరి­ష్కారం, ఫైనల్‌ సెల­క్షన్‌ లిస్ట్‌, కాన్ఫి­డె­న్షి­యల్‌ సెక్షన్‌ వంటి పను­లన్నీ కమి­షన్‌ చేయా­ల్సిం­టుంది. ఈ పను­లన్నీ కమి­ష­న్‌లో ఉన్న కొంత­మంది సిబ్బం­ది­తోనే జరు­గు­తు­న్నాయి. అందుకే నియా­మక ప్రక్రి­యలో జాప్యం జరు­గు­తు­న్న­దని అధి­కా­రులు చెబు­తు­న్నారు. ప్రశ్న­ప­త్రాల లీకేజీ తర్వాత గత ప్రభుత్వం పరీ­క్షల నిర్వ­హణ, కాన్ఫి­డె­న్షి­యల్‌ సెక్షన్‌ పర్య­వే­క్షణ కోసం ఇతర రాష్ట్రాల సర్వీస్‌ కమి­షన్‌ తర­హాలో కంట్రో­లర్‌ ఆఫ్‌ ఎగ్జా­మి­నే­షన్స్‌ (సీఈవో) ను నియ­మిం­చింది. అయితే సీఈవో సంతోష్‌ బదిలీ అయ్యారు. యూపీ­ఎస్సీ చైర్మ­న్‌తో సీఎంతో పాటు భేటీ అయిన ముగ్గురు ఐఏ­ఎ­స్‌­లలో ఒక­రికి ఆ బాధ్య­తలు అప్ప­గించే అవ­కాశం ఉన్న­దని తెలు­స్తు­న్నది.

పార­ద­ర్శ­క­తకే ప్రాధాన్యం

జాబ్‌ క్యాలెం­డర్‌, సర్వీస్‌ కమి­షన్‌ ప్రక్షా­ళన, భవి­ష్య­త్తులో నియా­మక ప్రక్రి­యలో జాప్యం లేకుండా పార­ద­ర్శ­కంగా తీర్చి­ది­ద్ద­డా­నికే ప్రాధాన్యం ఇస్తు­న్నది. ఈ దిశ­గానే ప్రభుత్వం అడు­గులు వేస్తు­న్నది. రానున్న రోజుల్లో ఈ ప్రయ­త్నా­లకు ఎదు­ర­వు­తున్న అన్నీ సమ­స్య­లను అధి­గ­మించి నిరు­ద్యో­గులు ఎదు­రు­చూ­స్తున్న నోటి­ఫి­కే­షన్లు, పరీ­క్షల తేదీలు వెల్ల­డించే అవ­కా­శాలు కని­పి­స్తు­న్నాయి. జన­వరి నెల చివరి నాటికి దీనిపై స్పష్టత వస్తుం­దని ప్రభుత్వ వర్గాల ద్వారా సమా­చారం అందు­తు­న్నది.