ఐఐటీ విద్యార్ధిని ఆత్మహత్య

విధాత : ఐఐటీ ఖరగ్‌పూర్‌లో తెలంగాణకు చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. మెదక్ జిల్లా తూప్రాన్‌కు చెందిన కిరణ్ చంద్ర మంగళవారం రాత్రి హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫైనలియర్ చదువుతున్నాడు. ఏడాదిన్నరలో ఈ సంస్థలో ముగ్గురు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడటం చర్చనీయాంశమైంది.