కేసీఆర్ బరిలో ఉన్న గజ్వేల్‌లో 114.. కామారెడ్డి 58 మంది అభ్యర్థులు పోటీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. 119 నియోజకవర్గాల్లో 2,898 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. 119 నియోజకవర్గాల్లో 2,898 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. 608 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు అధికారులు పేర్కొన్నారు. అత్యధికంగా గజ్వేల్‌లో 114 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మేడ్చల్‌లో 67, కామారెడ్డిలో 58, ఎల్‌బీనగర్‌లో 50 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో 15 మంది బరిలో ఉన్నారు. అత్యల్పంగా నారాయణపేట నియోజకవర్గంలో కేవలం ఏడుగురు మాత్రమే పోటీలో ఉన్నారు. ఇక గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. నామినేషన్ల ఉపసంహరణకు గడువు బుధవారం మధ్యాహ్నం వరకు ఉంది.