ఆ యాడ్స్ ఉపసంహరించుకోవాలి: వికాస్‌రాజ్
తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలకు భారత ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది.

- ఎంసీఎంసీ నిబంధనలకు ఆ ప్రకటనలు
- విరుద్ధంగా ఉన్నాయని స్పష్టీకరణ
- కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు
- తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి
- వికాస్‌రాజ్ లేఖలు జారీ
విధాత: తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలకు భారత ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) నియమ, నిబంధనలకు విరుద్ధంగా రూపొందించి వివిధ మాద్యమాల్లో ప్రసారం చేస్తున్న ప్రకటనలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆదేశించింది.
ఈ మేరకు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు లేఖలు రాశారు. ఆయా పార్టీలు రూపొందించిన రాజకీయ ప్రకటనలు అభ్యంతరకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఎంసీఎంసీ నియమ, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న మొత్తం 15 ప్రకటనలు ఆయా పార్టీలు ఉసంహరించుకోవాలని లేఖలో సూచించారు.
సర్టిఫికెట్ కమిటీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని ఇప్పటికే అన్ని పార్టీలు అంగీకరించాయని, నిబంధనలకు విరుద్దంగా ఉన్న ప్రకటనలు వెంటనే తొలగించాలని, మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మూడు పార్టీలకు రాసిన లేఖలో వికాస్ రాజ్ పేర్కొన్నారు. ఆయా ప్రకటనలను వెంటనే నిలిపివేయాలని, ఉపసంహరించాలని ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్‌మీడియా చానెళ్లకు కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్టు లేఖలు వెల్లడించారు.