TGNPDCL | కరెంటు బిల్లు కట్టడం ఇక ఈజీ..!
తెలంగాణ ఎన్పిడిసిఎల్ (TGNPDCL) తెలంగాణ జిల్లాల్లో కరెంటు బిల్లులు కట్టడానికి క్యూఆర్ కోడ్ ఉపయోగించనున్నట్లు తెలిపింది.

టిజిఎన్పిడిసిఎల్((తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్) తను విద్యుత్ పంపిణీ చేస్తున్న జిల్లాల్లో ఇకనుండీ కరెంటు బిల్లులు కట్టడాన్ని సులభతరం చేసింది. బిల్లులు చెల్లించడానికి కొత్తగా క్యూఆర్ కోడ్(QR Code) విధానాన్ని తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. కొత్త విధానం ప్రకారం, మీటర్ రీడింగ్ తీసుకున్న తర్వాత ఇంటికి పంపే బిల్లులపై ఇకనుండి క్యూఆర్ కోడ్ (QR code on Power bills) ముద్రించనున్నట్లు ఎన్పిడిసిఎల్ తెలిపింది. దీని ద్వారా వినియోగదారులు తన మొబైల్ ఫోన్‌తో కోడ్‌ను స్కాన్ చేసి బిల్లు వెంటనే చెల్లించవచ్చని, ఇది వినియోగదారులకు ఎంతో సులభమైన మార్గమని వారు అంటున్నారు.
బిల్లులోని కోడ్‌ను స్కాన్ చేయగానే, వినియోగదారుడి వివరాలు, ఈ నెల బిల్లు వివరాలు, కట్టాల్సిన మొత్తం వెంటనే ఓపెన్ అవుతాయి. అందులోనే బిల్లులో ఉన్న మొత్తాన్ని ఎంటర్ చేసి, ఓకే చెప్పగానే, పేమెంట్ గేట్‌వేకు వెళ్లి, పేమెంట్ ఆప్షన్స్ చూపుతుంది. అందులో క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపిఐ లాంటి చెల్లింపు ప్రక్రియల ద్వారా వెంటనే కరెంటు బిల్లు కట్టేయొచ్చు. ఈ విధానాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ ఏప్రిల్‌లో వరంగల్‌లోని మట్టెవాడలో, మే నెలలో వరంగల్ జిల్లాలో, జూన్‌లో భూపాలపల్లి జిల్లాలో ఎన్పిడిసిఎల్ అమలుచేసి సత్ఫలితాలను పొందింది. తెలంగాణ పాత ఉమ్మడి జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఈ ఎన్పిడిసిఎల్ పరిధిలోకి వస్తాయి.
ఈ క్యూఆర్ కోడ్ విధానాన్ని దశలవారీగా(in Phased manner in all the Districts) తమ పరిధిలోని అన్ని జిల్లాల్లో అమలు చేస్తామని ఎన్పిడిసిఎల్ అధికారులు చెబుతున్నారు. ఈ కోడ్ ఒక్కసారి బిల్లు చెల్లింపుకే వర్తిస్తుందనీ, ప్రతీనెల కోడ్ మారుతూంటుందని వారు తెలిపారు. బిల్లులో ఉండే క్యూఆర్ కోడ్‌ను, పేటీఎం, గూగుల్ పే, ఫోన్‌పే, భీమ్ లాంటి యూపిఐ యాప్(Cards, Net Banking, UPI Apps) ల ద్వారా స్కాన్ చేసి, క్షణాల్లో బిల్లు కట్టేయొచ్చని, కట్టిన మరుక్షణంలోనే, బిల్లు కట్టినట్లు ఎస్ఎంఎస్(SMS Acknowledgment) కూడా వస్తుందని ఎన్పిడిసిఎల్ అధికారి ఒకరు తెలియజేసారు.
Read More
24.. డెడ్‌లైన్ టార్గెట్.. 26!
Pulasa fish | గోదావరికి పులసొచ్చింది.. వలకు చిక్కిన కేజిన్నర చేప.. ధర ఎంత పలికిందంటే..!
Praneeth Hanumanthu | ఎవరీ యూట్యూబ్ సైకో… ప్రణీత్ హనుమంతు?
Ujjaini Mahankali | సికింద్రాబాద్ లష్కర్ బోనాలు.. ఉజ్జయిని మహంకాళి అనే పేరు ఎలా వచ్చింది..? అసలు 1813లో ఏం జరిగింది..?