Revanth Reddy | మోదీ పరివార్‌కు, రాహుల్ పరివార్‌కు మధ్య ఈ ఎన్నికలు
దేశంలో రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లు రద్దు చేయాలని మోదీ ప్రయత్నిస్తుంటే,రాజ్యాంగాన్ని రక్షించాలని, రిజర్వేషన్లు పెంచాలని రాహుల్ గాంధీ కంకణం కట్టుకున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.

కామారెడ్డి సభలో సీఎం రేవంత్ రెడ్డి
విధాత : దేశంలో రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లు రద్దు చేయాలని మోదీ ప్రయత్నిస్తుంటే,రాజ్యాంగాన్ని రక్షించాలని, రిజర్వేషన్లు పెంచాలని రాహుల్ గాంధీ కంకణం కట్టుకున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికలు మోదీ పరివార్, రాహుల్ పరివార్ మధ్య జరుగుతున్న యుద్ధం అని అభివర్ణించారు. ఈడీ, ఐటీ,సీబీఐ, ఢిల్లీ పోలీస్, ఆదానీ, అంబానీలు మోదీ పరివార్ అని, దేశంకోసం ప్రాణాలు అర్పించిన ఇందిరమ్మ, రాజీవ్… తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ, ప్రియాంక, కోట్లాది కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ గాంధీ పరివార్ అని అన్నారు. మోదీజీ పరివార్ ను ఓడించి రాహుల్ పరివార్ ను గెలిపించాలని తెలిపారు. జహీరాబాద్ ఎంపీగా సురేష్ షెట్కార్ ను లక్ష మెజారిటీతో గెలిపించాలని కోరారు.