విజయశాంతి కాంగ్రెస్‌లోకి వస్తారు: మల్లు రవి

విజయశాంతి కాంగ్రెస్‌లోకి వస్తారు: మల్లు రవి

విధాత : బీజేపీ సీనియర్ నాయకురాలు మాజీ ఎంపీ విజయశాంతి రేపోమాపో కాంగ్రెస్‌లోకి వస్తారని టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి వెల్లడించారు. తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ జరుగుతున్న నేపధ్యంలో విజయశాంతి కాంగ్రెస్‌లో రాబోతున్నారన్నారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. విజయశాంతి కొంతకాలం బీజేపీ నాయకత్వంతో అంటిముంటనట్లుగా వ్యవహారిస్తున్నారు.


కాగా.. ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పోటీ చేసేందుకు ఒక దశలో కామారెడ్డి, గజ్వేల్ టికెట్లను ఆశించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇటీవల పార్టీ ప్రకటించిన స్టార్ క్యాంపయినర్ల జాబితాలో విజయశాంతి పేరు చేర్చలేదు. తర్వాతా ఆమె పేరు చేర్చినా ఆమె అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం లేదు. ఈ నేపధ్యంలో విజయశాంతి త్వరలోనే కాంగ్రెస్‌లో చేరుతారన్న ప్రచారం వినిపిస్తుంది. మెదక్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ టికెట్‌ను ఆశిస్తున్నారని తెలుస్తుంది.