నేడు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కమిటీ సమావేశం

విధాత‌: టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఇటీవలే పార్టీ సభ్యత్వ నమో దు, డిజిటలైజేషన్‌ ప్రక్రియ పూర్తయింది. పార్టీ కార్యకర్తలకు ప్రమాదబీమా సొమ్మును పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ బీమా సంస్థలకు అందజేశా రు. దేశంలో మరే రాజకీయ పార్టీకి లేనివిధంగా సుశిక్షుతులైన 61 లక్షల గులాబీ శ్రేణులకు సమావేశంలో సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు. […]

నేడు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కమిటీ సమావేశం

విధాత‌: టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు.

ఇటీవలే పార్టీ సభ్యత్వ నమో దు, డిజిటలైజేషన్‌ ప్రక్రియ పూర్తయింది. పార్టీ కార్యకర్తలకు ప్రమాదబీమా సొమ్మును పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ బీమా సంస్థలకు అందజేశా రు. దేశంలో మరే రాజకీయ పార్టీకి లేనివిధంగా సుశిక్షుతులైన 61 లక్షల గులాబీ శ్రేణులకు సమావేశంలో సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రశాఖల పునర్నిర్మాణంపై సీఎం కేసీఆర్‌ మార్గదర్శనం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయిదాకా పార్టీ సంస్థాగత నిర్మాణానికి మంగళవారం జరిగే సమావేశంలో షెడ్యూల్‌ ప్రకటించే అవకాశాలున్నాయి. దళితబంధు పథకం అమలు తీరుతెన్నులు, పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, తీసుకోవాల్సిన చర్యలు, చేయాల్సిన కృషిపై అధినేత పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సంధాకర్తగా పార్టీ శ్రేణులు ఎలా పనిచేయాలో, దళిత బంధు పథకం అనివార్యత ఏమిటో అధినేత వెల్లడించనున్నట్టు తెలిసింది.