ప్రభుత్వ భూముల రక్షణ కోసం ఉద్యమిస్తాం: బీజేపీ నేత సూర్యనారాయణ

విధాత, నిజామాబాదు: నిజామాబాదు అర్బన్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ భూముల రక్షణకు బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమం తప్పదని ఆ పార్టీ నాయకుడు ధన్ పాల్ సూర్యనారాయణ హెచ్చరించారు. ఈ మేరకు బీజేపీ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాదు నగరంలోని దుబ్బ చౌరస్తా నుంచి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్‌పాల్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ధన్‌పాల్ సూర్యనారాయణ […]

ప్రభుత్వ భూముల రక్షణ కోసం ఉద్యమిస్తాం: బీజేపీ నేత సూర్యనారాయణ

విధాత, నిజామాబాదు: నిజామాబాదు అర్బన్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ భూముల రక్షణకు బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమం తప్పదని ఆ పార్టీ నాయకుడు ధన్ పాల్ సూర్యనారాయణ హెచ్చరించారు. ఈ మేరకు బీజేపీ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాదు నగరంలోని దుబ్బ చౌరస్తా నుంచి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్‌పాల్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ధన్‌పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు కూల్చేస్తూ ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పేందుకు కుట్ర జరుగుతుందన్నారు.

దీనిని తమ అర్బన్ బీజేపీ శాఖ తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. అర్బన్ నియోజకవర్గంలో ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెపితే త్వరలోనే ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. పాత భవనం కూల్చి ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పాలన్న కుట్రలను తిప్పి కొడతామన్నారు.

పాత ఎమ్మార్వో, ఆర్డిఓ, డీఈఓ కార్యాలయాలను ఇప్పటికే కూల్చేశారని, కూల్చిన స్థలాల్లో ఏమి నిర్మిస్తారని, ఆ స్థలాలను ఏమి చేయదలుచు కుంటున్నారో వెల్లడించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

దీనిపై బ్లూ ప్రింట్, మాస్టర్ ప్లాన్ పై స్వేత పత్రాన్ని విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ ను డిమాండ్ చేశారు. ప్రజలకు జిల్లా కలెక్టర్ ఒక వారధిగా పని చేయాలి తప్ప అధికార పార్టీకి కొమ్ముకాస్తే ప్రజలతో కలిసి ఉద్యమాన్ని చెప్పడతామని హెచ్చరించారు. ఒక వేళ కూల్చిన స్థలాల్లో ఏవైనా నిర్మాణాలు చేపట్టదల్చు కుంటే ప్రతిపాదనలను వెల్లడించాలని కోరారు.

ఇదే విషయమై శ్వేత పత్రం విడుదల చేయమని భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేపడుతున్నామని, గత వారం రోజుల నుంచి చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు.

కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, అల్జాపూర్ శ్రీనివాస్, మోహన్ రెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శిలు పోతనకల్ లక్ష్మీనారాయణ, న్యాలం రాజు, గోపిడి స్రవంతి రెడ్డి, పంచారెడ్డి లింగం ,పంచ రెడ్డి ప్రవళిక శ్రీధర్, ఎర్రం సుధీర్, మాస్టర్ శంకర్, మెట్టు విజయ్, భరత్ భూషణ్, ఇప్పకాయల కిషోర్, బంటు రాము, ఇల్లెందుల ప్రభాకర్, మండల అధ్యక్షుడు రోషన్లాల్ బోర, పుట్ట వీరేందర్, గడ్డం రాజు, బిజెపి నాయకులు పాల్గొన్నారు.