వరంగల్: డబ్బులున్నోళ్లే గెలిచే రోజులు: కూనంనేని

గాంధీని నిలబెట్టినా ఇప్పటి ఎన్నికల రాజకీయాల్లో ఓడిపోతారు విధాత, వరంగల్: డబ్బులున్నవాల్లే గెలిచే రోజులొచ్చాయని, గాంధీని నిలబెట్టినా ఇప్పటి ఎన్నికల రాజకీయాల్లో ఓడిపోతారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. కురవిలో సిపిఐ అమరవీరుల స్థూపాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడారు. మన కళ్ళముందే ప్రొఫెసర్ కోదండరాం ఓడిపోలేదా, కమ్యూనిస్టు నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి ఓడిపోలేదా అంటూ ప్రశ్నించారు. ఎన్నికల రాజకీయాలు కమ్యూనిస్టులుగా మేము పట్టించుకోమన్నారు. […]

వరంగల్: డబ్బులున్నోళ్లే గెలిచే రోజులు: కూనంనేని
  • గాంధీని నిలబెట్టినా ఇప్పటి ఎన్నికల రాజకీయాల్లో ఓడిపోతారు

విధాత, వరంగల్: డబ్బులున్నవాల్లే గెలిచే రోజులొచ్చాయని, గాంధీని నిలబెట్టినా ఇప్పటి ఎన్నికల రాజకీయాల్లో ఓడిపోతారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. కురవిలో సిపిఐ అమరవీరుల స్థూపాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడారు.

మన కళ్ళముందే ప్రొఫెసర్ కోదండరాం ఓడిపోలేదా, కమ్యూనిస్టు నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి ఓడిపోలేదా అంటూ ప్రశ్నించారు. ఎన్నికల రాజకీయాలు కమ్యూనిస్టులుగా మేము పట్టించుకోమన్నారు. ప్రజల పక్షాన పోరాడడమే లక్ష్యమని అన్నారు.

బిజేపిని తెలంగాణాలో అధికారంలోకి రానివ్వమని చెప్పారు. తూర్పున సూర్యుడు ఉదయిస్తున్నంత కాలం మనిషిలో రక్తం ఉన్నంతకాలం కమ్యూనిజం బ్రతికే ఉంటుందని సాంబశివరావు అన్నారు.

కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు తక్కెళ్ళపల్లి శ్రీనివాస్ రావు, జిల్లాకార్యదర్శి బి విజయసారధి, జిల్లాసహాయకార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.