బీఆరెస్ ఓటమితోనే తెలంగాణకు ఆత్మగౌరవం: యెన్నం శ్రీనివాస్ రెడ్డి

బీఆరెస్ ఓటమితోనే తెలంగాణకు ఆత్మగౌరవం: యెన్నం శ్రీనివాస్ రెడ్డి

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: తెలంగాణ ఆత్మగౌరవం కాపాడుకోవాలంటే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించాలని కాంగ్రెస్ నేత యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్ 15వ వార్డు చిన్నదర్పల్లిలో మంగళవారం ఆయన పార్టీ తరపున ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్నం బీఆర్ఎస్ పై మాటల తూటాలు పేల్చారు. కేసీఆర్ ప్రభుత్వం మాటలకే పరిమితమై, చేతల్లో కనిపించడం లేదన్నారు.


మాయమాటలు చెప్పి గద్దే నెక్కుతారని, ప్రజలు మేల్కొని ఈ ప్రభుత్వాన్ని సాగనంపితే బతుకులు బాగుపడతాయన్నారు. ఆత్మ గౌరవం అంటూ బూటకపు మాటలు చెప్పి, నిలువునా ముంచారన్నారు. డబ్బులకే డబుల్ బెడ్రూం ఇళ్లుగా పథకాన్ని అభాసుపాలు చేశారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలు ప్రతి పల్లె, వాడ, ప్రతి వ్యక్తికి అందుతాయని అన్నారు. అనంతరం కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలకు వివరించారు. ఎన్నం వెంట కాంగ్రెస్ నాయకులు వినోద్ కుమార్, సిరాజ్ ఖాద్రి, లక్ష్మణ్ యాదవ్, బెనాహర్ నాగరాజు, రమేష్ నాయక్ ఉన్నారు.