Jasmine Flower | తెల్లని మల్లెపూలంటే ఇష్టపడని వారెవరుంటారు. వాటి అందం వెన్నకన్నా, వెన్నెలకన్నా తీయనిది. మత్తెక్కించే మల్లెపూల వాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారతీయ సంప్రదాయంలో పెళ్లయిన వ్యక్తులు తమ భార్యలకు మల్లెపూలు తీసుకెళ్తుండేవారు. అయితే, ఈ పూలు కేవలం భార్యాభర్తల మధ్య మూడ్‌ను పెంచడంతో పాటు అనేక ప్రయోజనాలు అందిస్తాయి.
Jasmine Flower | తెల్లని మల్లెపూలంటే ఇష్టపడని వారెవరుంటారు. వాటి అందం వెన్నకన్నా, వెన్నెలకన్నా తీయనిది. మత్తెక్కించే మల్లెపూల వాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారతీయ సంప్రదాయంలో పెళ్లయిన వ్యక్తులు తమ భార్యలకు మల్లెపూలు తీసుకెళ్తుండేవారు. అయితే, ఈ పూలు కేవలం భార్యాభర్తల మధ్య మూడ్‌ను పెంచడంతో పాటు అనేక ప్రయోజనాలు అందిస్తాయి. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో భార్యలకు మల్లెపూలు తీసుకువెళ్లే వారి సంఖ్య భారీగా తగ్గింది. చాలా మంది పడక గదిలో మూడ్‌ను పెంచేందుకు మల్లెలను పెట్టుకుంటారనే అపోహలున్నాయి.
వాస్తవానికి భర్తలు తమ భార్యలకు ఎందుకు మల్లెపూలు తీసుకువెళ్లడంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. మల్లెపూలు పెట్టుకోవడం వెనుక ఎన్నో కారణాలున్నాయని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. కొత్తగా పెళ్లయిన దంపతుల మధ్య తొలిరేయి రోజున నూతన జంట మధ్య బంధం బలపడేందుకు సహకరిస్తాయి. మల్లెపూల వాసన మెదడుని ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. పడక గదిలో మంచంపైనున్న సమయంలో ఒత్తిడిని దూరం చేస్తుంది. సిగ్గు, భయాన్ని పోగొతుంది. అలాగే, శీఘ్ర సల్కనం కాకుండా ఉంటుంది.
మంచంపై మల్లెపూలను చల్లడంతో వాటి వాసనను దంపతులు పీల్చడంతో ప్రశాంతంగా ఉండడంతో పాటు ఉత్తేజంగా.. ఆనందంగా ఉంటారు. మల్లెపూలతో అటు భార్యకు.. ఇటు భర్తకు కూడా ప్రయోజనమేనని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. సాంప్రదాయపరంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా, ఔషధపరంగా మల్లెపూలతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. అందానికి, ఆనందానికి, గాఢమైన ఆప్యాయతకు చిహ్నంగా మల్లెపూలను పరిగణిస్తుంటారు. మల్లెపూలను ఎక్కువగా చనుబాలు ఇచ్చే స్త్రీలు ధరించేవారు. బాలింతలు మల్లెపూలను తలలో పెట్టుకోవడంతో బిడ్డకు కావాల్సిన పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతుంటాయి.
దాంతో లాక్టేషనల్ అమెనోరియా పెరగడమే కాకుండా.. పాల ఉత్పత్తికి అవసరమైన గాలాక్టోపోయిసిస్ స్థాయి పెరుగుతుంది. మల్లెపూలు ధరించడం వల్ల చలువ చేస్తుంది. మల్లెలు పుర్రెవేడిని జుట్టు ద్వారా గ్రహించి బయటకు వెళ్లేలా చేస్తాయి. అయితే, పూర్వపు రోజుల్లో మగాళ్లు సైతం మల్లెలను ధరించేవారట. ప్రస్తుతం మగాళ్లు మల్లెపూలు పెట్టుకోవడం మానేశారు. మల్లెల సువాసనతో నిద్రలేమి తగ్గుతుందని.. మెడిసిన్‌లా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆ వాసనకు మత్తు కలిగి.. అతి కోపాన్ని తగ్గించే గుణం ఉంటుందని చెబుతున్నారు. చిరాకు, కోపాన్ని తగ్గించి.. మానసిక ప్రశాంతత కలిగేలా చేస్తాయి. ముఖ్యంగా దంపతుల మధ్య అనుబంధం పెరిగేలా మల్లెపూలు సహకరిస్తాయని వైద్య నిపుణులు వివరించారు.