Health tips | బరువు తగ్గాలంటే వ్యాయామం, డైట్‌ మాత్రమే సరిపోదు.. అది కూడా చాలా ముఖ్యం..!

Health tips : ఏటికేడు భూమ్మీద ఊబకాయుల సంఖ్య బాగా పెరిగిపోతోంది. ప్రతి 10 మందిలో ఒకరు ఊబకాయంతో బాధపడుతున్నారు. దాంతో శరీర బరువును తగ్గించుకునేందుకు చాలామంది, చాలా కసరత్తులు చేస్తుంటారు. రకరకాల ఆహార నియమాలు పాటిస్తుంటారు. అయినా బరువు తగ్గక అవస్థలు పడుతుంటారు. అయితే బరువు తగ్గేందుకు వ్యాయామం, డైట్‌ మాత్రమే సరిపోవని, వాటికితోడు కంటి నిండా నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

చాలినంత నిద్రపోతే శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారని నిపుణుల సూచిస్తున్నారు. నిద్రలేమి అనేది బరువు పెరగడానికి కారణమవుతుందంటున్నారు. నిద్రకు, బరువుకు మధ్య ఉన్న సంబంధం గురించి ఎన్‌మామి అగర్వాల్‌ అనే న్యూట్రిషనిస్ట్‌ తన ఇన్‌స్టా హ్యాండిల్‌లో వెల్లడించారు. రోజూ వ్యాయామం చేసినా, బరువు పెరగడానికి కారణమయ్యే ఆహార పదార్థాలను దూరం పెట్టినా.. మీరు బరువు తగ్గడం లేదంటే అందుకు కారణం సరైన నిద్ర లేకపోవడమేనని అగర్వాల్‌ చెప్పారు.

నిద్రలేమితో దుష్ప్రభావాలు

1. అధికంగా కొవ్వు నిలువ

న్యూట్రిషనిస్ట్‌ అగర్వాల్ చెప్పిన ప్రకారం.. నిద్రలేమి కారణంగా శక్తి ఉత్పత్తి కోసం కొవ్వు కరగడానికి బదులుగా ఒంట్లో పేరుకుపోతుంది. మీ శరీరం కొవ్వులను కరిగించే శక్తిని కోల్పోతుంది.

2. కార్టిసాల్‌ స్థాయిల పెంపు

నిద్రలేమి ఒంట్లో కార్టిసాల్‌ (ఒత్తిడి హార్మోన్‌) స్థాయిలు పెరిగేలా చేస్తుంది. ఒంట్లో కార్టిసాల్‌ స్థాయిలు ఎక్కువైతే బరువు తగ్గే ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది. ఎందుకంటే కార్టిసాల్‌ ఎక్కువైతే మనం అవసరానికి మించి క్యాలరీలు తీసుకుంటాం. దాంతో బరువు పెరుగుతాం.

3. నిదాన జీవక్రియ రేటు

మనం తీసుకునే క్యాలరీలను కరిగించే శక్తి స్థాయినే జీవక్రియ రేటు అంటారు. జీవక్రియ రేటు ఎంత వేగంగా ఉంటే అంత సులువుగా బరువు తగ్గవచ్చు. నిద్రలేమి మన జీవక్రియ వేగాన్ని తగ్గిస్తుంది. దాంతో బరువు తగ్గడం చాలా కష్టతరం అవుతుంది.