దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ: తిరుపతి రెడ్డి
విధాత, మెదక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవ దినోత్సవాన్ని పురస్కరించుకొని మెదక్ పట్టణంలోని డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ జెండా ఎగురవేశారు. అనంతరం సీనియర్ కాంగ్రెస్ నాయకులకు జిల్లా కాంగ్రెస్ రథసారధి కంఠా రెడ్డి తిరుపతి రెడ్డి సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం నాడు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసిందని, అలాగె 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవెర్చింది కూడా కాంగ్రెస్ పార్టీయ్యేనని ఆయన అన్నారు. దేశంలో, రాష్ట్రంలో నేడు […]

విధాత, మెదక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవ దినోత్సవాన్ని పురస్కరించుకొని మెదక్ పట్టణంలోని డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ జెండా ఎగురవేశారు. అనంతరం సీనియర్ కాంగ్రెస్ నాయకులకు జిల్లా కాంగ్రెస్ రథసారధి కంఠా రెడ్డి తిరుపతి రెడ్డి సన్మానం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం నాడు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసిందని, అలాగె 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవెర్చింది కూడా కాంగ్రెస్ పార్టీయ్యేనని ఆయన అన్నారు. దేశంలో, రాష్ట్రంలో నేడు నియంత పాలన నడుస్తుందని ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకాంగా ప్రభుత్వాలు నడుస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు.
కార్యక్రమంలో పీసీసీ నాయకులు మామిళ్ల అంజనేయులు, మ్యడం బాలకృష్ణ, ప్రభాకర రెడ్డి, శ్రీకాంతప్ప, ఆవుల భాగ్యలక్షి గూడూరి ఆంజనేయులు, రమేష్ రెడ్డి, రాజలింగం, శ్రీనివాస్, శం రెడ్డి, పల్లె రాంచదర్ గౌడ్, శంసుందర్, మంగ మోహన్, గోవింద్ నాయక్, ప్రేమ్ కుమార్, భూపతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.