ముగిసిన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు.. తేలని ఫలితం

వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యినప్పటికి ఫలితం తేలలేదు.

ముగిసిన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు.. తేలని ఫలితం

రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు షురూ

విధాత : వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యినప్పటికి ఫలితం తేలలేదు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు ఆధిక్యత వచ్చినప్పటికి గెలుపుకు అవసరమై కోటా ఓట్లు ఏ అభ్యర్థికి రాకపోవడంతో అధికారులు రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఎలిమినేషన్ పద్దతిలో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. కాగా రెండో ప్రాధాన్యత ఓట్లపై బీఆరెస్ పార్టీ భారీ ఆశలు పెట్టుకుంది. గతంలో మాదిరిగా రెండో ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా గెలుస్తామని ఆ పార్టీ నాయకత్వం అంచన వేస్తుంది.