నర్సంపేట రోడ్లకు మహర్దశ.. రూ.40కోట్ల30 లక్షలు మంజూరు: MLA సుదర్శన్‌రెడ్డి
త్వరలో పనులు ప్రారంభం విధాత, వరంగల్: నర్సంపేట నియోజకవర్గంలోని మండల కేంద్రాల నుంచి ఉన్న ప్రధాన రహదారులన్నింటికి మరమ్మతులు, కొత్త రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. సోమవారం దీనికి సంబంధించిన వివరాలు పెద్ది వెల్లడించారు. నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్ల నిర్మాణ పనుల కోసం రూ.40 కోట్ల 30 లక్షలు మంజూరైనట్లు చెప్పారు. గత సంవత్సరంలో నర్సంపేట నియోజకవర్గం వ్యాప్తంగా అత్యధిక వర్షాలు కురవడం వలన రోడ్లు ధ్వంసమయ్యాయని […]

- త్వరలో పనులు ప్రారంభం
విధాత, వరంగల్: నర్సంపేట నియోజకవర్గంలోని మండల కేంద్రాల నుంచి ఉన్న ప్రధాన రహదారులన్నింటికి మరమ్మతులు, కొత్త రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. సోమవారం దీనికి సంబంధించిన వివరాలు పెద్ది వెల్లడించారు. నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్ల నిర్మాణ పనుల కోసం రూ.40 కోట్ల 30 లక్షలు మంజూరైనట్లు చెప్పారు.
గత సంవత్సరంలో నర్సంపేట నియోజకవర్గం వ్యాప్తంగా అత్యధిక వర్షాలు కురవడం వలన రోడ్లు ధ్వంసమయ్యాయని గుర్తు చేశారు. ధ్వంసమైన రోడ్ల మరమ్మతులతో పాటు, నూతన రోడ్ల నిర్మాణాలు చేపట్టడానికి చేసిన ప్రయత్నం ఫలించినట్లు ఎమ్మెల్యే చెప్పారు.
మంజూరైన రోడ్లు, నిధులు..
- నెక్కొండ నుండి ఇనుగుర్తి వరకు వయా సాయిరెడ్డిపల్లి రూ.12 కోట్లు
- నర్సంపేట నుండి నెక్కొండ వరకు రూ.6 కోట్ల 70 లక్షలు
- నర్సంపేట నుండి వరంగల్ వరకు రూ.5 కోట్ల 32 లక్షలు
- నెక్కొండ నుండి ఇంటికన్నే వరకు రూ.2 కోట్ల 48 లక్షలు
- చెన్నరావుపేట నుండి గుండెంగ వరకు వయా పాపయ్యపేట రూ.2 కోట్ల 46 లక్షలు
- నర్సంపేట నుండి నల్లబెల్లి వరకు వయా మాదన్నపేట రూ.96 లక్షలు
- చెన్నరావుపేట నుండి ఉప్పరపల్లి వరకు నూతన సీసీ రోడ్ రూ.2 కోట్ల 50 లక్షలు
- పనికర నుండి మాచ్చాపూర్ వరకు వయా దీక్షకుంట రూ.2 కోట్ల 38 లక్షలు
- జల్లి నుండి లింగగిరి వరకు రూ.1 కోటి 50 లక్షలు
- మహ్మద్ గౌసుపల్లి మరియు నందిగామ గ్రామాల మధ్యలో బ్రిడ్జి నిర్మాణం కోసం 2 కోట్ల 10 లక్షలు
- మహ్మద్ గౌసుపల్లి మరియు నందిగామ గ్రామాల మధ్యలో బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.1 కోటి 90 లక్షలు
త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి కానుందన్నారు. వెనువెంటనే పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు.