దమ్ముంటే గోషామహల్‌లో పోటీకి రండి.. ఒవైసీ బ్రదర్స్‌కు రాజాసింగ్ సవాల్

విధాత : గోషామహల్ నుంచి నీవు ఎందుకు అభ్యర్ధిని నిలబెట్టలేడం లేదని…ఇక్కడే కదా నీ పార్టీ ఆఫీస్, దారుసలాం ఆఫీస్‌లు కూడా ఉన్నాయని, దమ్ముంటే గోషామహల్‌లో ఎంఐఎం అభ్యర్ధిని నిలబెట్టాలని, లేదంటే ఓవైసీ సోదరులు పోటీకి దిగాలని ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్ చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇటీవల రాజాసింగ్ మైనార్టీలపైన, ఒవైసీపైన విమర్శలు చేస్తున్నా ఎందుకు అక్కడ గోషామహల్‌లో అభ్యర్ధిని నిలబెట్టడం లేదని ఒవైసీని ప్రశ్నించాడని, దీనిపై తాను రేవంత్‌కు బదులిస్తున్నానన్నారు.
ఒవైసీ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ము కాస్తాడని, దేశంలో ఎక్కడైనా ఎన్నికలుంటే తమ పార్టీ అభ్యర్థిని నిలబెడుతా అంటూ పార్టీలను బ్లాక్ మెయిల్ చేయడం, డబ్బులు వసూలు చేసుకోవడం అలవాటుగా మార్చుకున్నాడన్నారు. ఆయనే మైనార్టీలకు రక్షణ అని చెప్పుకుంటాడని, నిజానికి వారు తప్ప ముస్లింలు మాత్రం అభివృద్ధి చెందలేదన్నారు. అయినా వారి సమస్య నాకు అవసరం లేదని, ఎందుకంటే వారు నాకు ఓట్లు ఎలాగు వేయరని, నేను కూడా అడుగనన్నారు.
గోషామహల్ లో ప్రత్యర్ధి పార్టీల్లో ఎవరికి టికెట్లు ఇవ్వాలో ఎంఐఎం ఆఫీస్ నుంచి, దారుసలాం నుంచే నిర్ణయిస్తారన్నారు. 2014లో ముఖేశ్‌గౌడ్‌కు మద్ధతునివ్వడానికి ఒవైసీ డబ్బులు తీసుకున్నాడని, 2018లో బీఆరెస్ అభ్యర్ధిని కూడా ఆయనే నిర్ణయించడని ఆరోపించారు. బీఆరెస్ నాయకులు గోషా మహల్ టికెట్ కోసం బీఆరెస్ ఆఫీస్ చుట్టు తిరుగుతున్నారని, ఒవైసీకి డబ్బులిస్తే వెంటనే వారికి టికెట్ వస్తదని సలహా ఇచ్చారు.