ఆడపిల్ల పెళ్లికి లక్షతో పాటు తులం బంగారం: రేవంత్‌రెడ్డి

విధాత : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయల సహాయంతో పాటు తులం బంగారం అందిస్తుందని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ హాజరైన కాంగ్రెస్ విజయభేరీ బస్సు యాత్ర ములుగు సభలో రేవంత్ ఈ విషయాన్ని వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందన్నారు. పేద మహిళలకు 500లకే గ్యాస్ సిలిండర్, రైతులకు ఏటా 15వేలు, రైతు కూలీలకు 12వేల ఆర్ధిక సహాయం సహా కాంగ్రెస్ ప్రకటించిన అన్ని హామీలను నెరవేరుస్తుందన్నారు