ఇక టార్గెట్‌ లోక్‌­సభ!

కాంగ్రెస్ క్యాడర్‌ అంతా సమి­ష్టిగా లోక్‌­సభ ఎన్ని­క­లకు సన్నద్ధం కావా­లని, 17 ఎంపీ స్థానాలు టార్గె­ట్‌గా పని­చే­యా­లని రేవం­త్‌­రెడ్డి పిలు­పు­ని­చ్చారు

ఇక టార్గెట్‌ లోక్‌­సభ!
  • 17 సీట్ల­లోనూ విజయం దిశగా కృషి
  • 8, 9 తేదీల్లో ముఖ్య నేత­లతో భేటీలు
  • 10 నుంచి 12 వరకు ఇన్‌­చా­ర్జ్‌­లతో..
  • 20 నుంచి క్షేత్ర­స్థాయి పర్య­ట­నలు
  • ఆరు గ్యారం­టీల అమ­లుకు ఐదు­గురు సభ్యు­లతో ఇంది­రమ్మ కమి­టీలు
  • ఎన్ని­కల తర్వాత ‘నామి­నే­టెడ్‌’ భర్తీలు
  • బొక్కలు విరి­గినా బీఆ­రె­స్‌కు బుద్ధి­రా­లేదు
  • కిష­న్‌­రె­డ్డికి ఆదాయం తగ్గి­న­ట్టుంది..
  • అందుకే సీబీఐ విచా­రణ అడు­గు­తు­న్నారు
  • పీసీసీ విస్తృత స్థాయి సమా­వే­శంలో పీసీసీ అధ్య­క్షుడు, సీఎం రేవం­త్‌­రెడ్డి
  • నేడు ఢిల్లీకి.. నామి­నే­టెడ్‌ పోస్టు­లపై చర్చ!

విధాత: తెలం­గాణ కాంగ్రెస్ నాయ­కత్వం, క్యాడర్‌ అంతా సమి­ష్టిగా లోక్‌­సభ ఎన్ని­క­లకు మిషన్ మోడ్‌లో సన్నద్ధం కావా­లని, 17 ఎంపీ స్థానాలు టార్గె­ట్‌గా పని­చే­యా­లని పీసీసీ చీఫ్, ముఖ్య­మంత్రి రేవం­త్‌­రెడ్డి పిలు­పు­ని­చ్చారు. బుధ­వారం గాంధీ­భ­వ­న్‌లో ఏఐ­సీసీ తెలం­గాణ ఇన్‌­చార్జ్‌ దీపా­దాస్ మున్షీ పర్య­వే­క్ష­ణలో రేవం­త్‌­రెడ్డి అధ్య­క్ష­తన జరి­గిన పీసీసీ విస్తృత స్థాయి సమా­వేశం నిర్వ­హిం­చారు. ఇందులో ప్రధా­నంగా లోక్‌­సభ ఎన్ని­కల సన్నా­హా­లపై చర్చిం­చారు. ఈ నెల 8, 9 తేదీల్లో లోక్‌­సభ నియో­జ­క­వ­ర్గం­లోని ముఖ్య నేత­లతో, 10 నుంచి 12 వరకు ఇన్‌­చా­ర్జ్‌­లతో సమా­వేశం నిర్వ­హిం­చా­లని నిర్ణ­యిం­చారు. ఈ నెల 20నుంచి పీసీసీ చీఫ్ సీఎం రేవం­త్‌­రెడ్డి క్షేత్ర స్థాయి పర్య­ట­న­లకు వెళ్ల­ను­న్నారు.


ఆరు గ్యారం­టీల అమ­లుకు ఐదు­గురు సభ్యు­లతో ఇంది­రమ్మ గ్రామ కమి­టీ­లను ఏర్పాటు చేయా­లని, తెలం­గాణ నుంచి సోని­యా­గాంధీ పోటీ చేయా­లని తీర్మానం చేశారు. తెలం­గా­ణలో కాంగ్రె­స్‌ను అధి­కా­రం­లోకి తీసు­కొ­చ్చేం­దుకు ఎంతో సమ­న్వ­యంతో పని­చే­సిన మాణిక్ రావు ఠాక్రే అభి­నం­దిస్తూ రెండవ తీర్మా­నాన్ని ఆమో­దిం­చారు. ఏఐ­సీసీ తెలం­గాణ ఇన్‌­చార్జ్‌ దీపా­దాస్ మున్షీకి అభి­నం­ద­నలు తెలు­పుతూ మరో తీర్మానం చేశారు. నామి­నే­టెడ్ పోస్టుల భర్తీని లోక్‌­సభ ఎన్ని­కల తర్వాత చేప­ట్టా­లని నిర్ణయం తీసు­కు­న్నారు.


 


బీఆ­రెస్‌, బీజే­పీలు తోడు దొంగలు : రేవం­త్‌­రెడ్డి

బీజేపీ, బీఆ­రె­స్‌లు తోడు దొంగ­లని, కాళే­శ్వరం పేరుతో ఇద్దరూ కలిసి ప్రజా­ధ­నాన్ని దోచు­కు­తి­న్నా­రని ముఖ్య­మంత్రి రేవం­త్‌­రెడ్డి మండి­ప­డ్డారు. పాల­మూరు ఎత్తి­పో­త­లకు అన్యాయం చేశా­రని విమ­ర్శిం­చారు. పీసీసీ విస్తృత స్థాయి సమా­వే­శంలో ఆయన మాట్లా­డుతూ కాళే­శ్వరం అవి­నీ­తిపై జ్యుడి­షి­యల్ విచా­రణ చేసి తీరు­తా­మని స్పష్టం చేశారు. ఆనాడు స్వయంగా కాళే­శ్వరం అవి­నీ­తిపై తాను సీబీఐ ఎంక్వ­యిరీ కోరి­న­పుడు కేంద్ర మంత్రిగా ఉన్న కిష­న్‌­రెడ్డి ఏం చేశా­రని నిల­దీ­శారు. కిషన్ రెడ్డికి ఆదాయం తగ్గి­న­ట్టుం­దని, అందుకే కాళే­శ్వ­రంపై ఇప్పుడు సీబీఐ ఎంక్వ­యిరీ కోరు­తు­న్నా­రని చుర­క­లం­టిం­చారు. దొంగను గజ­దొం­గకు పట్టిం­చా­లని కిషన్ రెడ్డి అడు­గు­తు­న్నా­డని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్ని­కల్లో బొక్క బోర్లా­పడి బొక్కలు విరి­గినా బీఆ­రె­స్‌కు బుద్ధి­రా­లే­దని, నెల రోజులు గడ­వ­క­ముందే కాంగ్రెస్ హామీ­లపై పుస్త­కాలు విడు­దల చేస్తు­న్నా­రని విమ­ర్శిం­చారు. చెరుకు తోటల్లో పడిన అడవి పందుల్లా తెలం­గా­ణను బీఆ­రెస్ దోచు­కుం­ద­న్నారు. బీఆ­రెస్ విమ­ర్శ­లను కాంగ్రెస్ శ్రేణు­లను ఎక్క­డి­క­క్కడే దీటుగా తిప్పి­కొ­ట్టా­ల­న్నారు. ప్రజ­లకు ఇచ్చిన ఆరు గ్యారం­టీ­లను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి తీరు­తుం­దని స్పష్టం­చే­శారు.

కష్ట­ప­డి­వా­రికి తగిన గుర్తింపు

పార్టీ కోసం కష్ట­ప­డిన వారిని గుర్తించి.. వీలై­నంత త్వరగా వారికి సము­చిత స్థానం కల్పించే బాధ్యత తమ­దే­నని రేవం­త్‌­రెడ్డి హామీ ఇచ్చారు. 17 లోక్‌­సభ స్థానాల్లో గెలుపు లక్ష్యంగా పెట్టు­కుని కనీసం 12 స్థానాలు తగ్గ­కుండా గెలి­పిం­చు­కో­వా­ల­న్నారు. పీసీసీ విస్తృత స్థాయిలో తీసు­కున్న నిర్ణయం మేరకు లోక్‌­సభ సన్నా­హక సమా­వే­శాలు సమీ­క్షలు కొన­సా­గు­తా­య­న్నారు.

వచ్చే అన్ని ఎన్ని­క­ల్లోనూ గెల­వాలి : దీపా­దాస్ మున్షీ

తెలం­గాణ అసెంబ్లీ ఎన్ని­కల్లో విజ­యాల స్ఫూర్తితో రానున్న లోక్‌­సభ ఎన్ని­కలు, స్థానిక సంస్థలు సహా అన్ని ఎన్ని­క­ల్లోనూ విజయం సాధిం­చేం­దుకు పార్టీ నాయ­కత్వం, క్యాడర్‌ మరింత టీమ్ వర్క్‌తో పని­చే­యా­లని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవ­హా­రాల ఇన్‌­చార్జ్‌ దీపా­దాస్ మున్షీ పిలు­పు­ని­చ్చారు. తెలం­గా­ణలో అధి­కార సాధ­నకు కార్య­క­ర్తలు పదేళ్లు కష్ట­ప­డ్డా­రని అభి­నం­దిం­చారు. వచ్చే పార్ల­మెంట్ ఎన్ని­కల్లో ఈసారి మరింత శ్రమిం­చా­ల­న్నారు. తెలం­గా­ణలో హైద­రా­బా­ద్‌లో బోగస్ ఓట్లు చాలా ఉన్నా­యని, నాయ­కులు ఈ విష­యంలో ప్రత్యేక శ్రద్ధ తీసు­కుని పని­చే­యా­ల­న్నారు. రాష్ట్రంలో ఆరు గ్యారం­టీలు అమ­లుతో ప్రజల్లో సంతోషం వ్యక్తం అవు­తుం­ద­న్నారు. ప్రభుత్వం, పార్టీ సమ­న్వ­యంతో కలిసి పని­చేస్తే మరింత మంచి ఫలి­తాలు వస్తా­య­న్నారు.