Hyderabad | ఆ ఏడు రోజులు హైదరాబాద్‌లో జిరాక్స్ సెంటర్లు బంద్.. ఎందుకో తెలుసా..?
Hyderabad | రాష్ట్ర రాజధాని హైదరాబాద్( Hyderabad ) నగరంలో ఓ ఏడు రోజుల పాటు జిరాక్స్ సెంటర్లు( Xerox Centers ) మూతపడనున్నాయి. ఈ మేరకు పోలీసులు( Police ) ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి, జిరాక్స్ షాపులు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Hyderabad | హైదరాబాద్ : ఈ నెల 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్( Group-1 Mains ) పరీక్షల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం చేసింది. హెచ్ఎండీఏ( HMDA ) పరిధిలో 46 పరీక్షా కేంద్రాలను టీజీపీఎస్సీ( TGPSC ) సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్( Hyderabad ), సైబరాబాద్( Cyberabad ), రాచకొండ( Rachakonda ) పోలీసు కమిషనరేట్ల పరిధిలో 163 బీఎన్ఎస్ఎస్(144 Section ) సెక్షన్‌ను విధిస్తున్నట్లు ఆయా పోలీసు కమిషనర్లు ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో గ్రూప్-1 పరీక్షా కేంద్రాల వద్ద 200 మీటర్ల వరకు 21 ఉదయం 6 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు 163 బీఎన్ఎస్ఎస్ సెక్షన్ అమల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పోలీసుల ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. 163 సెక్షన్ నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద 5 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడొద్దు. ర్యాలీలు, ఊరేగింపులు, ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలపై నిషేధం విధించారు. దీంతో పాటు పరీక్షా కేంద్రాలకు 100మీటర్ల దూరంలో ఉన్న అన్ని ఫొటో, జిరాక్స్ సెంటర్లను(Xerox Centers ) సైతం మూసివేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.