కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరికలు

విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి పార్లమెంట్ సభ్యులు, నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం పలువురు బీఆరెస్ నాయకులు కాంగ్రెస్ లో చేరారు. మూడు సార్లు కౌన్సిలర్ గా ఎన్నికైన బోయిన్పల్లి శ్రీనివాస్, రెండుసార్లు కౌన్సిలర్ గా ఎన్నికైన ఎండీ సమి బీఆరెస్ ను వీడారు.
కోమటిరెడ్డి కండువా కప్పి వారిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ నల్గొండ గడ్డ కాంగ్రెస్ అడ్డా అని అన్నారు. మరో రెండు, మూడు రోజుల్లో బీఆర్ఎస్ కు చెందిన జడ్పీటీసీ లు, ఎంపీటీసీ లు, సర్పంచ్ లు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు తెలిపారు. నల్గొండలో బీఆర్ఎస్ పని ఇక ఖతమేనని, వెంకన్న జోరు ఏకపక్షంగా నడుస్తుందని తెలిపారు.