Harry Potter Snake | బీహార్ ఎమ్మెల్యే వంటింట్లో కనిపించిన హ్యారీపోటర్ సినిమాలోని ఆకుపచ్చపాము!
హారీపోటర్ సినిమాలో అకుపచ్చగా ఉండే పాము (Salazar Pit Viper) గుర్తుందా? అలాంటి పామును బీహార్‌లోని ఒక ఎమ్మెల్యే (MLA) వంటింట్లో గుర్తించారు. అత్యంత విషపూరితమైన ఈ పామును సురక్షితంగా వాల్మీకీ టైగర్ రిజర్వ్ (Valmiki Tiger Reserve) ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టారు.

Harry Potter Snake | హ్యారీపోటర్ సినిమాలో ఆకుపచ్చగా కనిపించే పాము గుర్తుందా? అరుదైన, అత్యంత విషపూరితమైన సర్పాల్లో ఇదొకటి. అందంగా కనిపించే దీనిని సలజార్ పిట్‌వైపర్ అని పిలుస్తారు. బీహార్‌లో వాల్మీకీ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో మాత్రమే కనిపించే ఈ పాము సెప్టెంబర్ 7న బీహార్‌లోని వాల్మీకీనగర్ ఎమ్మెల్యే ధీరేంద్ర ప్రతాప్ సింగ్ ఇంటిలో కనిపించింది. ఈ పాము విషం సెకన్ల వ్యవధిలోనే ప్రాణాలు తీయగల శక్తిమంతమైనది. ధీరేంద్ర నివాసంలో వంటింట్లో ఈ పాము కనిపించగా అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. శంకర్ యాదవ్ అనే అటవీ సిబ్బంది దానిని బంధించి, తిరిగి వాల్మీకీ టైగర్ రిజర్వ్‌లో సురక్షితంగా విడిచిపెట్టారు. ఎవరికీ ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఇది సలజార్ పిట్‌వైపర్ (Trimeresurus salazar) జాతికి చెందిన అత్యంత విషపూరితమైన సర్పమని నేచర్ ఎన్విరాన్‌మెంట్ వెల్ఫేర్ సొసైటీ (NEWS) ప్రాజెక్ట్ మేనేజర్ అభిషేక్ వివరించారు. ఇది బీహార్‌లో వాల్మీకీ టైగర్ రిజర్వ్‌లో మాత్రమే కనిపించే అరుదైన జాతి అని తెలపారు. దీనిని సురక్షితంగా వాల్మీకీ టైగర్ రిజర్వ్(VTR)లో వదిలేశామని చెప్పారు.
సలజార్ పిట్ వైపర్ తొలుత 2019లో అరుణాచల్ ప్రదేశ్‌లో గుర్తించారు. ఇటీవలి కాలంలో భారతదేశంలో కనుగొన్న ఐదవ కొత్త సరీసృప జాతి అని జీవశాస్త్ర నిపుణులు తెలిపారు. కేకే రౌలింగ్ రాసిన హ్యారీప్యాటర్ నవలలో హాగ్వార్ట్స్ స్థాపకుల్లో ఒకరైన సలజార్ స్లిధరిన్ నుంచీ దీని పేరు వచ్చింది. సలజార్ స్లిథరిన్ పాములతో మాట్లాడే శక్తికలిగినవాడిగా అభివర్ణిస్తారు.
సలజార్ పిట్ వైపర్ సన్నగా ఉంటుంది. పొడవు సుమారు 363 మిల్లీమీటర్ల నుంచి 415 మిల్లీమీటర్ల వరకూ ఉంటుంది. త్రికోణాకారంలో ఉండే దీని తల దీన్ని ప్రత్యేకంగా నిలిపింది. మగ పాములకు మెడవెంట సాగే కాషాయం, ఎరుపు గీత, తుప్పు రంగు లేదా నారింజ రంగులో ఉండే తోక ఉంటాయి. చూడగానే అవి ఆకుపచ్చ రంగులో కనిపించినప్పటికీ.. నారింజ, ఎరుపు, బంగారు రంగుల వేరియేషన్స్ కూడా కనిపిస్తాయి. మిగిలిన పిట్‌వైపర్‌ల తరహాలోనే వీటి నోటి దగ్గరలో వేడిని గుర్తించే అవయవాలు ఉంటాయి. వాటి ఆధారంగా అవి తమ ఆహారాన్ని గుర్తిస్తాయి. సలజార్ పిట్ వైపర్.. పశ్చిమభారతదేశంలో సాధారణంగా కనిపించే బాంబూ పిట్ వైపర్‌తో పోలి ఉంటుంది. కానీ.. బాంబూ పిట్ వైపర్ కంటే ఇదే అత్యంత విషపూరితమైనది.
ఇవికూడా చదవండి..
Telangana | తెచ్చిన అప్పులు తెచ్చినట్టే గాయబ్! మూడు నెలల తాజా అప్పు రూ.20,266.09 కోట్లు
Beer lovers rejoice | బీరు బాబులకు బంపర్ న్యూస్! తెలంగాణ హోటళ్లు, రెస్టారెంట్లలో ఇక బీరు నల్లాలు తిప్పుడే–గ్లాసులు నింపుడే
Russia Cancer Vaccine| క్యాన్సర్ రోగులకు శుభవార్త.. వందశాతం సమర్థతతో వ్యాక్సిన్ రెడీ!