Vidhaatha

Latest Telugu News

Menu Icon

సర్ భయంతో నేలకు దిగివస్తున్న ప్రధాన పార్టీల నేతలు

ప్రతిపక్ష పార్టీల కొంపలు కూల్చుతున్నదన్న ఆరోపణలు మూటగట్టుకుంటున్న సర్ ప్రక్రియ తెలంగాణలో విపక్ష పార్టీలను యాక్టివేట్ చేస్తున్నది. సర్ నేపథ్యంలో అనుకూల ఓటింగ్ ను కాపాడుకునేందుకు క్షేత్రస్థాయి క్యాడర్ వద్దకు కాంగ్రెస్, బీఆరెస్ నాయకులు పరుగులు తీస్తున్నారు. పార్టీ ఓటింగ్ ను కాపాడాల్సింది మీరేనంటూ నచ్చజెప్పుకొంటున్నారు.

విధాత ప్రత్యేకం

18.5 లక్షల మంది ఉసురు తీసుకున్నా.. సీబీఎస్ఈ కాంట్రాక్టర్ పై చర్యలు లేవా?

దేశంలో లక్షలాది మంది సీబీఎస్ఈ విద్యార్థుల మనోవేదన, మానసిక ఒత్తిడి, ఆత్మహత్యలకు పురిగొల్పేలా వ్యవహరించిన ఆన్ లైన్ స్క్రీనింగ్ అండ్ మార్కింగ్ (ఓఎస్ఎం) కాంట్రాక్టు దక్కించుకున్న ఏజెన్సీ పై కేంద్ర ప్రభుత్వం ఇంత వరకు చర్యలు తీసుకోలేదనే విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన జరిగి రెండు వారాలు గడుస్తున్నా సదరు సంస్థ పై ఈగ వాలకుండా కేంద్రం వ్యవహరిస్తున్న తీరు విద్యావేత్తలు, విద్యార్థుల తల్లిదండ్రులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.

విధాత ప్రత్యేకం

తెలంగాణ‌లో ఏడాదికి రూ.ల‌క్ష కోట్ల మ‌ద్యం విక్ర‌యాలు! పదేళ్లలో ఒక వ్యక్తి ఖర్చు ఎంతో తెలుసా?

తెలంగాణలో 2014-15 సంవ‌త్స‌రంలో ఎక్సైజ్ ఆదాయం స‌ర్కారుకు రూ.10 వేల కోట్లు ఉండ‌గా ఇప్పుడ‌ది రూ.40 వేల కోట్ల‌కు పెరిగింది.  అంటే ఇంచుమించు 400 శాతం పెరుగుదల కనిపిస్తున్నది. మొత్తంగా ఏటా లక్ష కోట్ల రూపాయల మద్యం వినియోగమవుతున్నట్టు అంచనా.

విధాత ప్రత్యేకం

బిల్డర్‌కు కరీంనగర్‌ విజిలెన్స్‌ విచిత్ర నోటీసు.. వెనుక కథ నడిపిందెవరు?

సాధారణంగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం.. ప్రభుత్వ అధికారులు, ప్రైవేటు కంపెనీలకు నోటీసులు జారీ చేస్తుంది. కానీ కరీంనగర్ రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్ ఒక బిల్డర్‌కు జారీ చేసిన నోటీసుపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

విధాత ప్రత్యేకం

ముఖ్యాంశాలు

హిందూ మహాసముద్రం అడుగున తిమింగలాల శ్మశానం రహస్యాలు…

హిందూ మహాసముద్రం అడుగున తిమింగలాల శ్మశానం రహస్యాలు…

సముద్ర గర్భాన్ని అన్వేషించే క్రమంలో అనేక వింతలు, విడ్డూరాలు, విచిత్రాలు, విస్మయంగొలిపే అంశాలు.. ఒకటా రెండా.. అనేకం బయటపడుతూ ఉంటాయి. అప్పటి వరకూ ఊహించిన అంశాలు పటాపంచలు చేస్తాయి. తాజాగా హిందూ మహాసముద్రం అట్టడుగున శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఒక ఆశ్చర్యకరమైన అంశాన్ని కనుగొన్నారు. అదే తిమింగలాల శ్మశానం! అదికూడా అత్యంత పురాతనమైనది.. అత్యంత పెద్దది.

హైదరాబాద్ లో మళ్లీ సర్కారీ భూముల వేలం..!

హైదరాబాద్ లో మళ్లీ సర్కారీ భూముల వేలం..!

తెలంగాణ ప్రభుత్వం రాజధాని హైదరాబాద్ లో మరోసారి భూముల వేలంకు షెడ్యూల్ జారీ చేసింది. బంజారాహిల్స్, మోకిల, మేడిపల్లి వంటి ప్రైమ్ ఏరియాల్లోని ప్ ఈ వేలంలో అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) జూన్ 17 నుంచి జూన్ 30 వరకు ఈ-వేలం నిర్వహించనుంది. ఈ మెగా వేలం ప్రక్రియలో భాగంగా హెచ్‌ఎండీఏ మొత్తం 176 ప్లాట్లను నోటిఫై చేసింది.

పైపైకి.. బంగారం, వెండి ధరలు

పైపైకి.. బంగారం, వెండి ధరలు

సోమవారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 2,450 పెరిగి రూ. 1,51,530కి చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 2,250 పెరిగి రూ. 1,38,900వద్ద నిలిచింది. అటు కిలో వెండి ధర సైతం రూ. 10,000పెరిగి రూ. 2,80,000కు చేరింది.