Vidhaatha

Latest Telugu News

Menu Icon

బాల్క సుమన్‌ ‘విధ్వంస’ వ్యాఖ్యలు యాదృచ్ఛికమా.. వ్యూహాత్మకమా?

నోరు జారారా? లేక పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే పెద్ద నాయకుడై పోతానని అనుకున్నారా? క్యాడర్‌లో జోప్‌ నింపబోయారా? ఏదైతేనేం.. బీఆరెస్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ చేసిన విధ్వంసకర వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. సింగరేణి ఆఫీసు కాలబెట్టాలని, రైల్వే లైన్లు కోసేయాలని పిలుపునివ్వడం బీఆరెస్‌ అధినాయకత్వాన్ని డిఫెన్స్‌లో పడేసింది.

విధాత ప్రత్యేకం

వరంగల్‌ కాంగ్రెస్ నేతలు కలహాలు వీడారా? కొండాతో విభేదాలు తొలిగినట్టేనా?

మొన్నటిదాకా ఉప్పు నిప్పులా ఉన్న వరంగల్‌ కాంగ్రెస్‌లోని వైరి వర్గాలు ఆత్మీయ సమావేశం పేరిట ముచ్చట్లాడుకుని.. కలిసి భోజనం చేయడం రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. తమ మధ్య విభేదాలను పరిష్కరించుకునేందుకు కలిశారా? అధిష్ఠానం వార్నింగ్‌తో సమావేశమయ్యారా? లేక ఇలానే తిట్టుకుంటూ అభివృద్ధిని విస్మరిస్తే జనం ఓడిస్తారని భయపడ్డారా? కారణం ఏదైనా.. పార్టీ కింది స్థాయి క్యాడర్‌లో మాత్రం ఈ పరిణామం సానుకూలతను కలిగిస్తున్నది.

విధాత ప్రత్యేకం

పట్టు కోసం బీఆర్ఎస్ గట్టి ప్రణాళిక!

పదేండ్లలో ప్రజావ్యతిరేకతను చవిచూసి తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ తిరిగి పట్టు సాధించేందుకు గట్టి ప్రణాళికను అమలు చేస్తోంది. ఈ దఫా వ్యూహాత్మకంగా ప్రాంతాలను ఎంచుకుని, ఉమ్మడి జిల్లాలవారీగా పావులు కదుపుతోంది.

తెలంగాణ‌

లక్షల సీసీ కెమెరాలు ఉన్నా.. భగీరథ్‌ కదలికలు పసిగట్టలేకపోతున్నారా?

రాష్ట్రంలో చీమ చిటుక్కుమన్నా క్షణాల్లో వెంటాడి వేటాడుతామని పోలీసులు గతంలో ప్రకటించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్‌ను పట్టుకోవడంలో ఈ ఆధునిక సాంకేతిక పనిచేయడం లేదా? లేక ఉద్దేశపూర్వకంగానే ప్రజలను మభ్యపెడుతున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భగీరథ్‌పై పోక్సో కేసు నమోదై వారం దాటినా ఇంతవరకు పట్టుకోలేకపోయారంటే తెర వెనుక ఏమన్నా ప్రయత్నాలు జరుగుతున్నాయా? అన్న అంశం ప్రజల చర్చల్లో చోటు చేసుకుంటున్నది.

విధాత ప్రత్యేకం

ముఖ్యాంశాలు

హైదరాబాద్‌ కథ ఇంతటితో సమాప్తం.. క్వాలిఫయర్‌-2కు రాజస్థాన్‌ రాయల్స్‌

హైదరాబాద్‌ కథ ఇంతటితో సమాప్తం.. క్వాలిఫయర్‌-2కు రాజస్థాన్‌ రాయల్స్‌

ఐపీఎల్‌ 2026 ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్రయాణం ముగిసింది. భారీ స్కోరుతో ఒత్తిడి పెంచిన రాజస్థాన్‌ రాయల్స్‌.. హైదరాబాద్‌ను కకావికలం చేసి క్వాలిఫయర్‌-2లో గుజరాత్‌ టైటాన్స్‌తో పోరుకు సిద్ధమైంది.

పట్టపగలే చిమ్మ చీకటి.. ఆగస్ట్‌ 2న ఈ శతాబ్దంలోనే సుదీర్ఘ సూర్య గ్రహణం.. భారత్‌లో?

పట్టపగలే చిమ్మ చీకటి.. ఆగస్ట్‌ 2న ఈ శతాబ్దంలోనే సుదీర్ఘ సూర్య గ్రహణం.. భారత్‌లో?

అతి త్వరలో ఖగోళంలో అద్భుతం చోటు చేసుకోనున్నది. 21వ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘమైన సంపూర్ణ సూర్యగ్రహణం ఆగస్ట్‌ 2, 2026న ఏర్పడబోతున్నది. భారతదేశంలోని కొన్ని నగరాల్లో కూడా పాక్షిక సూర్యగ్రహణాన్ని వీక్షించవచ్చు.

పాములను పట్టబోయి..కాటుకు గురైన ఆమెరికా ఆరోగ్య మంత్రి

పాములను పట్టబోయి..కాటుకు గురైన ఆమెరికా ఆరోగ్య మంత్రి

అమెరికా ఆరోగ్య మంత్రి రాబర్ట్ ఎఫ్ కెన్నడీ పాములను ఒట్టి చేతులతో పట్టబోయి కాటుకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

రాజ్యసభకు సిద్దరామయ్య…సీఎంగా డీకే శివ‌కుమార్!

రాజ్యసభకు సిద్దరామయ్య…సీఎంగా డీకే శివ‌కుమార్!

కర్ణాటకలో సీఎం మార్పుకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సిద్దరామయ్య రాజీనామా చేసి డీకే శివకుమార్ సీఎం కానున్నారన్న ప్రచారం జోరందుకుంది.

‘సర్‌’ ప్రక్రియకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

‘సర్‌’ ప్రక్రియకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

ఓటర్ల జాబితా సమగ్ర సవరణ(SIR) ప్రక్రియకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం తీర్పు వెల్లడించింది. SIR చేపట్టేందుకు ఈసీకి అన్ని అధికారాలు ఉంటాయని తెలిపింది. ఆర్టికల్ 324 ప్రకారం ఈసీకి పూర్తి అధికారాలు ఉంటాయని స్పష్టం చేసింది.

కేర‌ళం మాజీ సీఎం విజ‌య‌న్ నివాసంలో ఈడీ సోదాలు

కేర‌ళం మాజీ సీఎం విజ‌య‌న్ నివాసంలో ఈడీ సోదాలు

కేరళం మాజీ సీఎం పినరయి విజయన్ నివాసంలో ఈడీ సోదాలు చేపట్టింది. విజ‌య‌న్ కుమార్తె నివాసంలోనూ ఈడీ సోదాలు కొన‌సాగుతున్నాయి. మ‌నీల్యాండ‌రింగ్ కేసులో ఈడీ బృందాలు మొత్తం 12 చోట్ల త‌నిఖీలు చేపట్టాయి. విజ‌య‌న్ కుమార్తె వీణాకు చెందిన కంపెనీ లావాదేవీల‌పై ఆరా తీస్తుంది.