Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

ఇక మెదడే మారణాయుధం! చదవితేనే మైండ్‌ బ్లాక్‌ అయ్యే న్యూరోటెక్నాలజీ అప్‌డేట్‌!

ఒక వ్యక్తిని ఆజ్ఞాపిస్తే ఒక పని చేసుకుని వస్తాడు! ఒకరిని అంతం చేయాలనుకుంటే సుపారీ తీసుకుని పనిపూర్తి చేసే వాళ్లు ఉన్నారు! కానీ.. ఒకరి మనసును వేరొకరి నియంత్రణలోకి తీసుకుని ఒక విధ్వంసానికి, ఒక మారణహోమానికి ప్రేరేపిస్తే? అదెలా సాధ్యమంటారా? అవుననే హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పటి వరకూ సైన్స్‌ఫిక్షన్‌ సినిమాల్లో చూసినవి అతి త్వరలో మన అనుభవంలోకి వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అదే న్యూరోటెక్నాలజీ!

human brain manipulation ai creation

ఏపీకి 'సెరియాన్' తుపాన్ హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ కు వాతావరణ శాఖ 'సెరియాన్' తుపాన్ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 48 గంటల్లో వాయుగుండం దక్షిణ బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం ఉందని వెల్లడించింది.

మీ ఫోన్ కు ఏపీకే ఫైల్ వ‌చ్చిందా.. అయితే త‌స్మాత్ జాగ్ర‌త్త‌

రోజురోజుకూ సైబ‌ర్ నేర‌గాళ్లు పన్నే ప‌న్నాగాలు అన్ని ఇన్నీ కావు, రోజుకో మార్గంలో అమాయ‌క ప్ర‌జ‌ల్ని బురిడీ కొట్టిస్తున్నారు. మొన్న‌టి వ‌ర‌కు ఓటీపీల‌తో మోసాల‌కు పాల్ప‌డ్డ కేటుగాళ్లు తాజాగా ఏపీకే ఫైల్స్ తో బ్యాంకు ఖాతాల‌ను లూటీ చేసేస్తున్నారు. వివిధ ర‌కాల బ్యాంకుల పేరుతో ఏపీకే ఫైల్స్ వాట్సాప్ లు, మెసేజ్ ల రూపంలో పంపి అప్ డేట్ చేసుకునేందుకు దిగువ‌న ఇచ్చిన ఏపీకే ఫైల్స్ ను ఇన్ స్టాల్ చేయ‌మ‌ని, లేదంటే బ్యాంకు అకౌంట్ ఫ్రీజ్ అవుతుంద‌ని చెబుతున్నారు.

స్మృతి మంధాన-పలాష్ ముచ్చల్ పెళ్లి వాయిదా

Smriti -Palash | టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన , మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్ వివాహం వాయిదా పడిన విషయం తెలిసిందే. నవంబర్ 23న మహారాష్ట్రలోని సాంగ్లీలో జరగాల్సిన ఈ పెళ్లి, స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన అస్వస్థత కారణంగా వాయిదా పడింది.

కూలిన డబుల్ బెడ్రూం బేస్మెంట్..విప్ ఆది శ్రీనివాస్ కి తప్పిన ప్రమాదం!

ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు పెను ప్రమాదం తప్పింది. వేములవాడలోని డబుల్ బెడ్రూం ఇండ్లను అధికారులు, అనుచరులతో కలిసి పరిశీలిస్తున్న క్రమంలో అకస్మాత్తుగా బేస్మెంట్ కుప్ప కూలిపోయింది.

కొత్త తోడేలు పాము గురించి విన్నారా? గ్రేట్‌ నికోబార్‌ దీవిలో గ్రేట్‌ డిస్కవరీ!

జీవ వైవిధ్యానికి ప్రఖ్యాతిగాంచిన గ్రేట్‌ నికోబార్‌ దీవిలో ఒక అరుదైన సర్పం శాస్త్రవేత్తలకు దర్శనమిచ్చింది. తోడులు పాము (వూల్ఫ్‌ స్నేక్‌)జాతికి చెందిన కొత్త రకం పాముగా దీనిని గుర్తించారు.

new wolf snake Lycodon irwini Great Nicobar Island

భర్తపై గృహ‌హింస కేసు పెట్టిన బాలీవుడ్ నటి

బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తన భర్త పీటర్ హాగ్ పై గృహ హింస కేసు పెట్టారు. తన భర్త నుంచి గృహ హింస, క్రూరత్వం, మానిప్యులేషన్ ఎదుర్కొంటున్నానని ఆరోపిస్తూ ఆమె ముంబై కోర్టు (Mumbai court) ను ఆశ్రయించారు.

Wedding In ICU

ఐసీయూలో యువతికి తాళి కట్టిన యువకుడు

పెళ్లి ముహూర్తం మిస్సవకూడదన్న భావనతో కేరళలో ఓ యువకుడు ఐసీయూలో చికిత్స పొందుతున్న వధువు అవనికి ఆస్పత్రిలోనే తాళి కట్టి పెళ్లి చేసుకున్న సంఘటన వైరల్‌గా మారింది.