దేశంలో సాధారణంగా ఆర్థిక సంవత్సరంలో వానాకాలం, యాసంగి పంటలు పండిస్తుంటారు. వానకాలంతో పోల్చితే యాసంగిలో వరి సాగు తక్కువగా ఉంటుంది. నీటి కొరత తక్కువగా ఉండటం, కనీస మద్ధతు ధర తక్కువ లభించడం మూలంగా సాగు అంతగా చేయరు. గత వానకాలంలో ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాలలో వరిసాగు బాగా జరిగింది. దేశంలో ఈ మూడు రాష్ట్రాలు అత్యధికంగా వరి సాగు చేయడంలో ముందంజలో ఉన్నాయి. వినియోగానికి మించి వస్తున్న దిగుబడిని నియంత్రించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది.
పాడిపంటలు
కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం, అనుమతులు, ఆమోదాలు రానందున సీఎం రేవంత్ కేంద్రం పైన పోరాటం చేస్తారా? లేక కేంద్రం సానుకూలంగా ఉన్నప్పటికీ, అడ్డుకుంటున్నారని చెబుతున్నందున కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఇక్కడే ఆందోళన చేపడుతారా? ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం పక్షాన నిరసనలు తెలియజేస్తారా?
విధాత ప్రత్యేకం
దేశంలోని చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలను విలీనం చేసుకునే ప్రక్రియను బీజేపీ వేగవంతం చేస్తున్నదా? ఇప్పటి వరకూ పార్టీల్లో చీలికలు పెట్టి, శాసనసభాపక్షాలను విలీనం చేసుకుంటూ వచ్చిన బీజేపీ.. ఇక నేరుగా ఆ యా ప్రాంతీయ పార్టీలను తనలో కలిపేసుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నదా? ఈ క్రమంలోనే ఏపీలో బీజేపీ ఫేస్‌గా పవన్ కల్యాణ్‌కు ఆఫర్ ఇచ్చిందా? ఇప్పుడు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ఇవే అంశాలు చర్చల్లో చోటు చేసుకుంటున్నాయి.
విధాత ప్రత్యేకం
‘దాహమేసినప్పుడే బావి తవ్వడం’ ప్రారంభించినట్లుగా తెలంగాణలో పంట మార్పిడి ప్రకటన ప్రభుత్వానికి ఆపద మొక్కుగా మారిందనే విమర్శలు రైతాంగంలో వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో పంట మార్పిడికి సంబంధించిన పకడ్బందీ ప్రణాళిక రూపొందించడం, అమలు చేయడంలో ప్రభుత్వం, యంత్రాంగం వంద శాతం విఫలమైందని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు రైతులు ఎందుకు మొగ్గు చూపడంలేదనే ప్రాథమిక కారణాలు అందరికీ తెలిసు. అయినా.. దీని మూలాలను నిజాయితీతో పరిష్కరించకుండా, కచ్చితమైన, నమ్మకమైన ప్రణాళిక రూపొందించి రైతులను ఒప్పించడంలో చిత్తశుద్ధి లేదనేది పదేపదే తేలిపోతోంది. మరో మాటలో చెప్పాలంటే దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని పరిశీలకులు అంటున్నారు.
పాడిపంటలు