Vidhaatha

Latest Telugu News

Menu Icon

గండిపేట నెత్తిన డాటా సెంటర్‌ కుంపటి

హైదరాబాద్‌ విడిది.. వికారాబాద్‌ అడవి. అనంతగిరి కొండల నుంచి కనిపించే అద్భుతం.. కానీ.. మరికొంత కాలానికి ఇది విషవాయువుల నిలయంగా మారనున్నదా? రేడియేషన్‌.. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టుతుందా? డాటా సెంటర్‌ సిటీ రూపంలో ఆధునిక సాంకేతిక రక్కసి జడలు విప్పితే జరిగే ఘోరాలేంటి?

విధాత ప్రత్యేకం

‘సర్’పై సుర్రుమంటున్న జనం.. ఫారాలు అందక ఎదురుచూపులు

హైదరాబాద్‌ నగరంలో సర్‌ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నదనే విమర్శలు వెల్లువెత్తతున్నాయి. ఇంకా మూడు వారాలే గడువు మిగిలినా.. ఇంకా పెద్ద సంఖ్యలో ఇళ్లకు బీఎల్‌వోలు వెళ్లలేదని తెలుస్తున్నది. దీంతో ఓటు పోతే సంక్షేమ పథకాలకు కోతపడుతుందేమోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విధాత ప్రత్యేకం

యాదగిరి గుట్ట ట్రస్ట్‌ బోర్డు నియామకంపై విమర్శల వెల్లువ.. మంత్రికి తెలియకుండా నియమించారా?

యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్టు బోర్డు నియామకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజా ప్రతినిధుల్లో ఒక్కరికి కూడా అవకాశం దక్కకపోవడాన్ని పలువురు తప్పపడుతుంటే.. సామాజిక తూకమేదని మరికొందరు నిలదీస్తున్నారు.

విధాత ప్రత్యేకం

ముఖ్యాంశాలు

శబ్దం లేని యుద్ధం.. స్పేస్‌ వార్‌ కోసం అమెరికా బ్రహ్మాస్తం.. ఉపగ్రహాలే టార్గెట్‌

శబ్దం లేని యుద్ధం.. స్పేస్‌ వార్‌ కోసం అమెరికా బ్రహ్మాస్తం.. ఉపగ్రహాలే టార్గెట్‌

రేపటి యుద్ధంలో బాంబుల పేలుళ్లు వినిపించకపోవచ్చు. దూసుకొచ్చే మిస్సైళ్లు కనిపించకపోవచ్చు. కానీ.. టార్గెట్‌.. ఆకాశంలో తిరుగుతున్న ఉపగ్రహాలే! అవి మూగబోయిన క్షణం.. సదరు దేశం భద్రతా వ్యవస్థ కళ్లు కనిపించవు.. చెవులు వినిపించవు. యుద్ధం ప్రారంభమయ్యేలోపే.. ఓటమి కూడా మొదలవుతుంది. అదే అమెరికా అభివృద్ధి చేయనున్న 'మెడోలాండ్స్'.

ఆ ఆరు హత్యలు ఎందుకు చేశానంటే.. షాబాద్‌ కిరాతకుడి సెల్ఫీ వీడియో

ఆ ఆరు హత్యలు ఎందుకు చేశానంటే.. షాబాద్‌ కిరాతకుడి సెల్ఫీ వీడియో

షాబాద్‌ను కుదిపేసిన 6 హత్యల కేసులో కొత్త ట్విస్ట్. హత్యలకు ముందు రాజ్‌కుమార్ రికార్డు చేసిన సెల్ఫీ వీడియో పోలీసులకు దొరికింది. అందులో అప్పులు, నమ్మకద్రోహం గురించి ఏమన్నాడు? దర్యాప్తులో బయటపడిన కీలక వివరాలు చదవండి.

CPS నుంచి OPSకు మారేందుకు ఏపీ ప్రభుత్వ నిర్ణయం.. తెలంగాణలోనూ అవకాశం కల్పించాలి

CPS నుంచి OPSకు మారేందుకు ఏపీ ప్రభుత్వ నిర్ణయం.. తెలంగాణలోనూ అవకాశం కల్పించాలి

ఆంధ్రప్రదేశ్‌ తరహాలో తెలంగాణలోనూ సీపీఎస్‌ నుంచి ఓపీఎస్‌కు మారేందుకు అవకాశం కల్పించాలని తెలగాణ జేఏసీ చైర్మన్‌ వీ లచ్చిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సీపీఎస్‌ నుంచి ఓపీఎస్‌కు మారేందుకు ఏపీ ప్రభుత్వం సోమ‌వారం (13.07.2026) జి.ఓ.ఎం.ఎస్. నెం.53 విడుదల చేసింది.

మాఝీ లడ్కీ బహిన్ యోజనలో 92 లక్షల మంది మరాఠా మహిళల పేర్ల తొలగింపు

మాఝీ లడ్కీ బహిన్ యోజనలో 92 లక్షల మంది మరాఠా మహిళల పేర్ల తొలగింపు

అక్రమాల పుట్టలా తయారైన ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బహిన్‌ యోజనలో 92 లక్షల మంది లబ్ధిదారులను మహారాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. దీంతో బడ్జెట్‌ గణనీయంగా తగ్గిపోనున్నది.

ప్రవహిస్తున్న నీటి నుంచే లిఫ్ట్ చేసుకునే వీలుంటే బ్యారేజీలు ఎందుకు కట్టారు?

ప్రవహిస్తున్న నీటి నుంచే లిఫ్ట్ చేసుకునే వీలుంటే బ్యారేజీలు ఎందుకు కట్టారు?

నీటి ప్రవాహం నుంచే ఎత్తిపోసుకునే అవకాశం ఉంటే కాళేశ్వరం బ్యారేజీలు ఎందుకు కట్టారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. బ్యారేజీ సరిగ్గా లేకపోయినా నీళ్లు నింపుకోవచ్చంటూ రాష్ట్ర ప్రజల మధ్యలోకి ఒక తప్పుడు ప్రచారాన్ని, గోబెల్స్ ప్రచారాన్ని వదిలారని మండిపడ్డారు.

డాటా సెంటర్లపై తిరగబడుతున్న అమెరికన్లు.. జూలై 18న 50 నగరాల్లో ఆందోళనలు

డాటా సెంటర్లపై తిరగబడుతున్న అమెరికన్లు.. జూలై 18న 50 నగరాల్లో ఆందోళనలు

డాటా సెంటర్ల వల్ల చోటు చేసుకొనే విధ్వంసాలను దృష్టిలో పెట్టుకుని అమెరికా ప్రజలు వాటి ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో అమెరికాలోని 50 ప్రధాన నగరాల్లో జూలై 18న పెద్ద ఎత్తున నిరసనలకు సిద్ధమవుతున్నారు. కానీ.. భారతదేశంలో మాత్రం వివిధ ప్రభుత్వాలు అంతటి విధ్వంసకర డాటా సెంటర్లను ఎదురేగి మరీ స్వాగతిస్తున్నారు.