Vidhaatha

Latest Telugu News

Menu Icon

అనిల్ అంబానీ బాకీలు రూ.71వేల కోట్లు… సీబీఐ, ఈడీ రంగంలోకి దిగినా చర్యలు లేవు

2012 నుంచి అనిల్‌ అంబానీ కంపెనీలు ఆదాయం లేక దివాలా దిశగా పయనిస్తున్నా బ్యాంకులు ఏమాత్రం వెనకడుగు వేయకుండా 2019 వరకు రుణాలు ఇస్తూ వెళ్లాయి. తీసుకున్న రుణాలను వాయిదాల ప్రకారం చెల్లించకుండా, నిధులను దారి మళ్లించినట్లు బ్యాంకుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. పెద్ద ఎత్తున విమర్శలు రావడం, సుప్రీంకోర్టు ఆదేశాలకు అప్పులు ఇచ్చిన బ్యాంకులు ఎట్టకేలకు అనిల్ అంబానీపై కేసులు పెట్టాయి. అనిల్ అంబానీ మొత్తం రూ.73వేల కోట్లు బకాయి పడినట్లు ఈడీ అధికారికంగా ప్రకటించడంతో దేశ ప్రజలు నివ్వెరపోయారు.

విధాత ప్రత్యేకం

మొన్న కేరళ.. నేడు కర్ణాటక.. రాజకీయ రుతుపవనం తెలంగాణనూ తాకేనా? రేవంత్‌ వద్ద ‘ప్లాన్‌ బీ’ ఉందా?

ఒకవైపు కేరళలో అధిష్ఠానం తన అభిప్రాయాన్ని పక్కనపెట్టి.. పార్టీ నేతల అభీష్టానికి విలువనిచ్చి.. సతీశన్‌ను సీఎం చేసింది. తదుపరి కర్ణాటకలో సైతం పార్టీ నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని డీకే శివకుమార్‌కు మార్గం సుగమం చేసింది. మరి తెలంగాణకూ ఈ రాజకీయ రుతుపవనం తాకుతుందా? 2034 వరకూ నేనే సీఎం అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వీలున్న ప్రతివేదికపైనా బలంగా బల్లగుద్దుతున్నారు. దీని వెనుక ప్లాన్‌ బీ ఏమైనా ఉన్నదా?

విధాత ప్రత్యేకం

11 ఏళ్లలో 9.75 లక్షల కోట్ల కార్పొరేట్‌ రుణాలు రైటాఫ్.. బడాబాబుల పట్ల కేంద్రం ఉదాశీనత

దేశంలో దొంగలు పడ్డారు అనేది పాత సామెత. కానీ బీజేపీ ప్రభుత్వ హయాంలో ‘బ్యాంకుల్లో గజదొంగలు పడ్డారు’ అనేది కొత్త స్లోగన్‌గా మారిపోయిందనే పరిస్థితి నెలకొన్నది. గడిచిన 11 ఏళ్లలో గుప్పెడు మంది కార్పొరేట్‌ బడాబాబులకు ఏకంగా 9.75 లక్షల కోట్ల రూపాయల రుణాలు రైటాఫ్‌ చేశారంటే.. వారి పట్ల ప్రభుత్వం ఎంత ఉదారంగా ఉన్నదో అర్థమవుతున్నది. దీనిపై విధాత వరుస కథనాలు. ది గ్రేట్‌ ఇండియన్‌ బ్యాంక్‌ రాబరీ పార్ట్‌ 1 చదవండి..

విధాత ప్రత్యేకం

బాల్క సుమన్‌ ‘విధ్వంస’ వ్యాఖ్యలు యాదృచ్ఛికమా.. వ్యూహాత్మకమా?

నోరు జారారా? లేక పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే పెద్ద నాయకుడై పోతానని అనుకున్నారా? క్యాడర్‌లో జోప్‌ నింపబోయారా? ఏదైతేనేం.. బీఆరెస్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ చేసిన విధ్వంసకర వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. సింగరేణి ఆఫీసు కాలబెట్టాలని, రైల్వే లైన్లు కోసేయాలని పిలుపునివ్వడం బీఆరెస్‌ అధినాయకత్వాన్ని డిఫెన్స్‌లో పడేసింది.

విధాత ప్రత్యేకం

ముఖ్యాంశాలు

రాజస్థాన్​ vs గుజరాత్​ కాదు.. గుజరాత్ vs వైభవ్‌! ఫైనల్లో బెంగళూరు ప్రత్యర్థి ఎవరో?

రాజస్థాన్​ vs గుజరాత్​ కాదు.. గుజరాత్ vs వైభవ్‌! ఫైనల్లో బెంగళూరు ప్రత్యర్థి ఎవరో?

ఐపీఎల్‌ 2026 క్వాలిఫయర్‌-2లో రాజస్థాన్‌ రాయల్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ తలపడనున్నాయి. ఫైనల్‌ టికెట్‌ కోసం జరిగే ఈ పోరులో వైభవ్‌ సూర్యవంశీనే బిగ్‌ డిఫరెన్స్‌గా మారనున్నాడు.

వినేశ్‌ ఫొగట్‌ సెలక్షన్‌ ట్రయల్స్‌లో పాల్గొనవచ్చు.. ఆమె దేశానికి కీర్తిని తీసుకొచ్చిందన్న సుప్రీంకోర్టు

వినేశ్‌ ఫొగట్‌ సెలక్షన్‌ ట్రయల్స్‌లో పాల్గొనవచ్చు.. ఆమె దేశానికి కీర్తిని తీసుకొచ్చిందన్న సుప్రీంకోర్టు

ప్రముఖ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు నిర్వహిస్తున్న ట్రయల్స్‌లో పాల్గొనేందుకు అడ్డంకులు తొలగిపోయాయి. ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోబోమన్న సుప్రీంకోర్టు.. ఆమె దేశానికి కీర్తిని తీసుకువచ్చారని ప్రశంసించింది.

కీలక దశకు అమెరికా–ఇరాన్‌ చర్చలు.. 300 బిలియన్ డాలర్ల పెట్టుబడులు.. హార్మూజ్‌ జలసంధి ప్రధానాంశాలు..

కీలక దశకు అమెరికా–ఇరాన్‌ చర్చలు.. 300 బిలియన్ డాలర్ల పెట్టుబడులు.. హార్మూజ్‌ జలసంధి ప్రధానాంశాలు..

అమెరికా, ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న చర్చలు పురోగతిలోనే ఉన్నాయని తెలుస్తున్నది. రెండు దేశాలకు చాలా వరకూ ఆమోదయోగ్యమైన ప్రతిపాదనలపై ఉభయ దేశాల ప్రతినిధులు చర్చిస్తున్నట్టు సమాచారం. ఇందులో ఇరాన్‌ పునర్నిర్మాణం, పెట్టుబడుల ప్యాకేజీ కింద 300 బిలియన్‌ డాలర్లు వెచ్చించే అంశం కూడా ఉన్నట్టు తెలుస్తున్నది. అదే సమయంలో మరో కీలక అంశం హార్మూజ్‌ జలసంధిని తెరిచే అంశం కూడా చర్చిస్తున్నారు.

అనిల్ అంబానీ బాకీలు రూ.71వేల కోట్లు… సీబీఐ, ఈడీ రంగంలోకి దిగినా చర్యలు లేవు

అనిల్ అంబానీ బాకీలు రూ.71వేల కోట్లు… సీబీఐ, ఈడీ రంగంలోకి దిగినా చర్యలు లేవు

2012 నుంచి అనిల్‌ అంబానీ కంపెనీలు ఆదాయం లేక దివాలా దిశగా పయనిస్తున్నా బ్యాంకులు ఏమాత్రం వెనకడుగు వేయకుండా 2019 వరకు రుణాలు ఇస్తూ వెళ్లాయి. తీసుకున్న రుణాలను వాయిదాల ప్రకారం చెల్లించకుండా, నిధులను దారి మళ్లించినట్లు బ్యాంకుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. పెద్ద ఎత్తున విమర్శలు రావడం, సుప్రీంకోర్టు ఆదేశాలకు అప్పులు ఇచ్చిన బ్యాంకులు ఎట్టకేలకు అనిల్ అంబానీపై కేసులు పెట్టాయి. అనిల్ అంబానీ మొత్తం రూ.73వేల కోట్లు బకాయి పడినట్లు ఈడీ అధికారికంగా ప్రకటించడంతో దేశ ప్రజలు నివ్వెరపోయారు.

Heat Wave | మ‌రో మూడు రోజులు వ‌డ‌గాల్పులే.. జ‌ర జాగ్ర‌త్త సుమా..!

Heat Wave | మ‌రో మూడు రోజులు వ‌డ‌గాల్పులే.. జ‌ర జాగ్ర‌త్త సుమా..!

Heat Wave | బుధ‌వారం తెల్ల‌వారుజామున అకాల వ‌ర్షాలు కురియ‌డంతో ఆ రోజంతా కొంత చ‌ల్ల‌ద‌నం ఏర్ప‌డిన‌ప్ప‌టికీ.. గురువారం మాత్రం ఎండ‌లు దంచికొట్టాయి. మండుటెండ‌ల‌తో పాటు వ‌డ‌గాల్పుల తీవ్ర‌త కొన‌సాగింది.

ఆల్విన్‌ కాలనీ నుంచి మియాపూర్‌ వరకూ కొత్త ఫ్లైవోవర్‌.. ఆ దారిలో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌..

ఆల్విన్‌ కాలనీ నుంచి మియాపూర్‌ వరకూ కొత్త ఫ్లైవోవర్‌.. ఆ దారిలో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌..

బాలానగర్‌ నుంచి మియాపూర్‌ వైపు వెళ్లే దారిలో ట్రాఫిక్‌ కష్టాలకు త్వరలో చెక్‌ పడనుంది. ఆల్విన్‌ కాలనీ నుంచి అంజయ్యనగర్‌ మీదుగా మియాపూర్‌ వరకూ 1.8 కిలోమీటర్ల పొడవున కొత్త ఫ్లైవోవర్‌ నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 330 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు.