Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

ఐటీ కంపెనీ షేర్లకు ఆంత్రోపిక్ ఏఐ గండం.. ఐబీఎం షేర్లు 13.2 శాతం ఢమాల్

ఆంత్రోపిక్ ఏఐ కంపెనీ దెబ్బకు ప్రముఖ ఐటీ కంపెనీలు విలవిల్లాడుతున్నాయి. తాజాగా ఐబీఎం కంపెనీ షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. ఆంత్రోపిక్ ఏఐలో అప్‌డేట్‌ టూల్‌ను ప్రకటించిన వెంటనే సోమవారం ఐబీఎంకు చెందిన షేర్లు మూడు దశాబ్ధాల్లో ఎన్నడూ లేని విధంగా అంతర్జాతీయ షేర్ మార్కెట్‌లో 13.2 శాతం కుప్పకూలాయి. ఐబీఎం చరిత్రలో సోమవారం ఒక దుర్దినంగా ప్రమోటర్లు భావించారు.

ibm shares fall anthropic ai impact

మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా తెలంగాణ !?

ఒకప్పుడు మావోయిస్టు ఉద్యమానికి పట్టుగొమ్మగా మారిన తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం మావోయిస్టు రహిత రాష్ట్రంగా అవిర్భవించబోతుంది. మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి , మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, నూనే నరసింహారెడ్డి సహా 15మంది తాజాగా తెలంగాణ ఎస్ఐబీ ముందు లొంగిపోవడంతో .. మావోయిస్టు పార్టీ ఉనికి తెలంగాణలో కనుమరుగైనట్లుగా పోలీసులు వెల్లడిస్తున్నారు.

మెక్సికో డ్రగ్‌ లార్డ్‌ ఒసేగేరా ఎన్‌కౌంటర్‌ వెనుక కీలక టిప్‌

అతడు మెక్సికోలో కరుడుగట్టిన డ్రగ్‌ లార్డ్‌. అసలు పేరు నెమెసియో ఒసేగేరా! అంతా ఎల్‌ మెంచో అని పిలుస్తారు. తలపై 15 మిలియన్‌ డాలర్ల రివార్డు అమెరికా ప్రకటించింది. ఒసేగేరాను పట్టుకోవడానికి ప్రభుత్వం చేయని ప్రయత్నాలు లేవు.. చివరకు విశ్వసనీయమైన ఒక టిప్‌.. అప్పటికప్పుడు ఒసేగువేరాను చుట్టుముట్టడంలో కీలక పాత్ర పోషించింది. ఆ టిప్‌.. డ్రగ్‌ లార్డ్‌ మరణానికి దారి తీసింది.

Mexican drug lord Oseguera killed

మోహన్ బాబు యునివర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య

తిరుపతిలోని ఎంబీయూ యూనివర్సిటీలో బీటెక్ విద్యార్థిని భువన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Mohanbabu University
AI-generated Video

సినిమా ఈజ్ డెడ్.. దారుణంగా కొట్టుకున్న మ‌హేశ్ బాబు, రాజ‌మౌళి

ఏఐ వీడియో (AI-generated Video) ఒక‌టి ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. అందులో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి (SS Rajamouli), టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు (Mahesh Babu) ఫైటింగ్ చేసుకుంటున్నారు.

AI-generated Video

సినిమా ఈజ్ డెడ్.. దారుణంగా కొట్టుకున్న మ‌హేశ్ బాబు, రాజ‌మౌళి

ఏఐ వీడియో (AI-generated Video) ఒక‌టి ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. అందులో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి (SS Rajamouli), టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు (Mahesh Babu) ఫైటింగ్ చేసుకుంటున్నారు.