Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

నాంపల్లి కోర్టులో మంత్రి కొండా సురేఖ కేసు వాయిదా

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. కొండా సురేఖకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 5 వ తేదీకి వాయిదా వేసింది.

తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే హవా!

తెలంగాణ గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల ఫలితాలలో అధికార కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. సింహభాగం సర్పంచ్ పదవులను గెలుచుకుని ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిపత్యం చాటింది.

అఖండ 2 సినిమా నిర్మాతలకు హైకోర్టు షాక్

అఖండ 2 సినిమా నిర్మాతలకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఇంకొన్ని గంటల్లో సినిమా విడుదల కావాల్సి ఉండగా.. ప్రీమియర్ షోకు రేట్ల పెంపుపై ప్రభుత్వ జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కు, సినీ నిర్మాణ సంస్థకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది.

సరెండర్ కండి..ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఆదేశాలు

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు చేసింది. ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్ రావును రేపు శుక్రవారం తెలంగాణ పోలీసులకు లొంగిపోవాలని ఆదేశించింది. కేసు విచారణ జరుగుతున్న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోవాలని స్పష్టం చేసింది.

మెస్సీ రాక కోసం క్రీడాభిమానులు ఎదురు చూపులు

ప్రపంచ ప్రఖ్యాత ఫుట్ బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ మరో మూడు రోజుల్లో ఇండియా కు రానున్నారు. మూడు రోజుల పాటు గోట్ ఇండియా టూర్ 2025 జరగనున్నది. కొలకత్తా లోని వీధులతో పాటు ముంబై మహా నగరం స్టేడియంలో, హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో కూడా మెస్సీ ఫుట్ బాల్ ఆడనున్నారు. డిసెంబర్ 13న ఉదయం కొలకత్తా, సాయంత్రం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం, డిసెంబర్ 14న ముంబై, చివరన 15వ తేదీ న్యూఢిల్లీలో పర్యటన ఉండనున్నది.

ఇన్నాళ్లు పిల్ల‌లు పుట్ట‌క‌పోవ‌డానికి కార‌ణం ఇదే..

Varun Sandesh | హ్యాపీ డేస్ సినిమాతో యువతలో మంచి గుర్తింపు పొందిన హీరో వరుణ్ సందేశ్. ఈ సినిమాతో వ‌రుణ్ సందేశ్ కొన్ని మంచి హిట్స్ అందిపుచ్చుకున్నాడు. కాని ఆ త‌ర్వాత కెరీర్ డౌన్ అయింది. బిగ్ బాస్ షోలో త‌న సతీమ‌ణితో క‌లిసి పాల్గొని సంద‌డి చేశాడు. అయితే తాజాగా వ్యక్తిగత విషయాలను ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Hand crafts

చైనీస్ హ్యాండ్ క్రాఫ్ట్ వండర్..వెదురుతో అద్భుత కళాఖండాలు

వెదురుతో మహిళా బొమ్మలు, గోపురాలు, బహుళ అంతస్తుల మోడల్స్ అద్భుతంగా తయారు చేసిన చైనీస్ వృద్ధ కళాకారుడు వీడియో వైరల్. చైనా ప్రాచీన హస్తకళ వైభవం మరోసారి వెలుగులోకి.