ఢిల్లీ: పదవులకు రాజీనామా చేసిన మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్.. ఆమోదించిన కేజ్రీవాల్
విధాత: ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకున్నది. పలు కేసుల్లో చిక్కుకున్న మంత్రులు ఇద్దరు తమ పదవులకు రాజీనామా చేశారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి పదవికి మనీష్ సిసోడియాతో పాటు మరో మంత్రి సత్యేందర్ జైన్ సైతం మంగళవారం పదవులకు రాజీనామా చేశారు. ఇద్దరు మంత్రుల రాజీనామాలను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆమోదించారు. మనీష్ సిసోడియాను ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీబీఐ ఆదివారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సోమవారం ఢిల్లీ కోర్టులో హాజరుపరుచగా.. […]

విధాత: ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకున్నది. పలు కేసుల్లో చిక్కుకున్న మంత్రులు ఇద్దరు తమ పదవులకు రాజీనామా చేశారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి పదవికి మనీష్ సిసోడియాతో పాటు మరో మంత్రి సత్యేందర్ జైన్ సైతం మంగళవారం పదవులకు రాజీనామా చేశారు.
ఇద్దరు మంత్రుల రాజీనామాలను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆమోదించారు. మనీష్ సిసోడియాను ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీబీఐ ఆదివారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సోమవారం ఢిల్లీ కోర్టులో హాజరుపరుచగా.. మార్చి 4వ తేదీ వరకు సీబీఐ కస్టడీకి ఇచ్చింది.
మరో వైపు అరెస్టు సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. మరో వైపు మనీలాండింగ్ కేసులో ఆయనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన విషయం విధితమే. ప్రస్తుతం ఆయన జైలులో ఉన్నారు.