Site icon vidhaatha

Smita Sabharwal : 6 నెలల సెలవులలో ఐఏఎస్ స్మితా సబర్వాల్

IAS Smita Sabharwal

Smita Sabharwal | విధాత, హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీ, ఐఏఎస్ స్మితా సబర్వాల్(IAS Smita Sabharwal) 6నెలల సెలవుపై వెళ్లారు. స్మితా సబర్వాల్ అభ్యర్థన మేరకు ఆగస్టు 1నుంచి 2026 జనవరి 31వరకు ప్రభుత్వం ఆమెకు 6నెలల చైల్డ్ కేర్ సెలవులు మంజూరీ చేసింది. ఆమె స్థానంలో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్, ఐఏఎస్ పి.కాత్యాయని దేవికి మెంబర్ సెక్రటరీగా పూర్తి స్థాయి అదనపు ఇంచార్జిగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానీయా ఉత్తర్వులు జారీ చేశారు.

గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం హయాంలో సీఎంవో కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహించిన స్మితా సబర్వాల్ కాళేశ్వరం ప్రాజెక్టు సహా పలు కీలక అంశాలలో ముఖ్య పాత్ర పోషించారు. కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) అవకతవకలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై చర్చించేందుకు ఈనెల 30నుంచి అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం నిర్వహించబోతుంది. అనంతరం కాళేశ్వరం నిర్మాణంలో అక్రమాలకు బాధ్యులైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశముంది. ఈ క్రమంలో స్మితా సబర్వాల్ సెలవు వ్యవహారం చర్చనీయాంశమైంది.

Exit mobile version