Vidhaatha

Latest Telugu News

ముఖ్యాంశాలు

మమ్దానీ చరిత్రాత్మక విజయం.. జెన్‌ జీ నిశ్శబ్ద విప్లవం!

బంగ్లాదేశ్‌, నేపాల్‌ తరహాలో వారేమీ వీధి పోరాటాలు చేయలేదు.. హింసాకాండకు పాల్పడలేదు.. ప్రజాస్వామిక దేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలోనే విద్వేషాన్ని, విభజనవాదాన్ని ఓడించవచ్చని నిరూపించారు. వారే న్యూయార్క్‌ జెన్‌ జీ! నగర మేయర్‌గా జోహ్రానీ మమ్దానీ ఎన్నికలో వీరు నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టించారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జూబ్లీ వార్‌లో కేసుల సవాల్! కేసులు ఎవరిపై? అరెస్టులు చేసేదెవరు?

కేసుల ప్రహసనం జూబ్లీ హిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో ప్రచార హీట్‌ను పెంచుతున్నది. బీఆరెస్‌ హయాంలో అవకతవకలపై కేసులలో అరెస్టులు ఎవరు చేయాలన్న విషయంలో అధికార, విపక్ష పార్టీలు సవాళ్లు విసురుకోవడం విశేషం.

చేవెళ్ల బాధితులను పరామర్శించే తీరిక లేదా?

కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం వెళ్లే ఘాట్ రోడ్డు లో ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు లోయలో పడి 65 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన తరువాత అప్పటి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు బాధితులను పరామర్శించలేదని బీజేపీ మొదలు కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు.

రైతులకు కన్నీటి గాయాలు.. తడిసి ముద్దవుతోన్న పంటలు!

రైతులను క‘న్నీటి’ గాయాలు వెంటాడుతున్నాయి. ఈ సీజన్ మొత్తం రైతులతో వానలు చెలగాటమాడుతున్నాయి. పూత, కాత దశలో కురిసిన వర్షాలతో పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం కనబరిచాయి. పత్తి పంట రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో దెబ్బతిన్నది. వరి పంట పొట్ట దశలో ఒకసారి, కోత దశలో మరోసారి, పంట కోసిన తర్వాత విక్రయించే దశలో పడరాని పాట్లుపడుతున్నారు.

The Girl Friend- Needhe Katha Lyrical Video

‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ నుంచి ‘నీదే కథ’ సాంగ్ విడుదల

రష్మిక మందన్నా, దీక్షిత్‌శెట్టి నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ సినిమా ప్రమోషన్లలో భాగంగా, ‘నీదే కథ’ అనే శక్తివంతమైన పాటను బుధవారం విడుదల చేశారు. రాకేందు మౌళి రాసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించారు.

Man Play with alligators in florida

ఎంత ధైర్యమో..నీళ్లలో మొసలితో ఆటలు!

ఫ్లోరిడా సరస్సులో క్రిస్ గిల్లెట్ అనే ప్రొఫెషనల్ మొసళ్ల పెంపకం శిక్షకుడు, 10 అడుగుల కాస్పర్‌ అనే శిక్షణ పొందిన ఎలిగేటర్‌తో నీళ్లలో ఆటలాడిన వీడియో వైరల్‌గా మారింది.